Facebook Twitter
సిరిసిల్ల సింహం కే.టీ.ఆర్

పట్టువదలని విక్రమార్కుడు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

కల్వకుంట్ల చంద్ర శేఖర రావు

కసికి,చేసిన పదిహేనేళ్ళ కృషికి

వ్యూహాత్మక నిరసనల,హోరుకు

పోరుకు,సాగించిన,ఉద్యమాలకు 

దక్కిన ప్రతిఫలం,ప్రత్యేక తెలంగాణ

ఆ తండ్రిమాటను జవదాటని

అభినవరాముడు,ఆలోచనాపరుడు

ఐటీలో మేటి, రారెవ్వరు వీరికి సాటి

నాడు ఉద్యమానికి ఊపిరి పోసిన

నేడు సిరిసిల్ల సింహం మన కే.టీ.ఆర్.

ప్రభుత్వ పథకాలపై, శాఖలపై

అవగాహన,పార్టీలో పట్టున్నదిట్ట

నాలుగు భాషల్లో అనర్గళంగా 

ఉపన్యసించి అందరిని అలరించే

ఉపన్యాస కేసరి మన కే.టీ.ఆర్

సమస్యలకు తక్షణం స్పందించే

ఆపదలోవున్న వారిని ఆదుకునే 

ఆపద్భాందవుడు, అందరివాడు

ప్రత్యర్థులచే ప్రశంసల నందుకునే

అజాత శతృవు మన కే.టీ.ఆర్

సహనం, సమయస్ఫూర్తి గల

సద్గుణ సంపన్నుడు, వినయం 

విధేయతగల, విద్యావంతుడు

నిస్వార్థపరుతుడు,నిర్మలమూర్తి

తండ్రిని మించిన తనయుడు

తగవులు తీర్చే తారకరాముడు 

రాజన్న సిరిసిల్లకు నాయకుడు 

 

భవిష్యత్తులో రాజకీయ వారసుడు 

రాష్ట్ర రథసారథి,అందరికి ఆశాకిరణం

తెలంగాణ గడ్డ దీవించిన తెలుగు బిడ్డ

యువనేత ! స్పూర్తి ప్రదాత ! మన కే.టీ.ఆర్

జయహో ! జయహో ! యంగ్ హీరో కే.టీ.ఆర్

Happy Birthday KTR 

& Long Live KTR