ఆంజనేయుని గుండెను
చీలిస్తే ఆ కోదండరాముడు దర్శనమిచ్చినట్టు
ఎందరో అభిమానుల
కవుల కళాకారుల గుండెచప్పుడే
మన కళారత్న బిక్కికృష్ణ గారు
వెలిగే ఎందరో కవిచంద్రుల వెనుక
ఒక కవి సూర్యుడున్నారంటారు..
కనిపించే ఆ కవి సూర్యుడే
మన కళారత్న బిక్కికృష్ణ గారు...
అబ్బబ్బా ! మనశ్శాంతి లేని
ఈ మహానగరం కన్నా
మహాయోగిలా మౌనంగా ఉండే
ఆ అడవే మేలు ! నే నడవికి పోతా !
కన్ను మూసి తపస్సుచేస్తానో
గన్ను పట్టి ఉషస్సు తెస్తానో...
ఆ ఒక్కటి మాత్రం అడక్కండి!! అంటూ
అనితరసాధ్యమైన సృజనాత్మక
ప్రతిభతో "ఈ దశాబ్దపు మహాకవిగా" దేదీప్యమానంగా వెలిగిపోతూ
ఆ వెలుగుల్ని అందరికీ పంచుతూ
తన విలువైన సమయాన్ని వెచ్చించి
తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
ఉచితంగా ఎందరినో కవులను సన్మానిస్తూ ఎన్నో సాహితీసభలను దిగ్విజయంగా నిర్వహిస్తూ...
అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా...
కవితా సూర్యుడిగా...
కలం యోధుడిగా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గాంచిన
సభాసామ్రాట్ కళారత్న బిక్కికృష్ణ గారికి
వందనం అభివందనం...పాదాభివందనం
ఒక మహావృక్షం నీడలో
చిన్నచిన్న మొక్కలు ఎదగవని...
అవి రెక్కలున్నా ఎగరలేని
పక్షులని అంటారు అందరూ
కానీ ఈ కళారత్న బిక్కికృష్ణ
అనే ఈ మహావృక్షం
ప్రతిభవున్న ప్రతికవికి
చల్లని నీడనిస్తుంది
ఎందరో ఔత్సాహిక కవులకు
అరుదైన అవకాశాలనందిస్తుంది
వేదికల మీద
సన్మానిస్తుంది సత్కరిస్తుంది
కవులుగా ఊహించని
గొప్ప గుర్తింపు నిస్తుంది...
తన శిష్యులందరూ
గురువును మించిన
శిష్యులు కావాలని
మనసారా నిస్వార్థంగా
కోరుకునే విశాలమైన...
ఉదారమైన...
శ్రీసాయి హృదయంగల...
ప్రేమమూర్తి...కరుణామూర్తి...
మా కళారత్న బిక్కికృష్ణ గారికి
వందనం అభివందనం...పాదాభివందనం
మహాకవులకు
అహంకారమే ఆభరణమని...
ఎప్పుడైనా ఎక్కడైనా
ఎదురు పడితే చూసి
చిరునవ్వు నవ్వరని...
చిన్నాచితకా కవులను
చిన్నచూపు చూస్తారని...
అంటారు...అందరూ
కానీ ప్రతికవిని ప్రోత్సాహిస్తూ
ప్రేమతత్వం...మంచితనం
పరిమళించే మానవత్వమే
మనిషికి నిజమైన
వ్యక్తిత్వమని...అదే దైవత్వమని...
దానికి తానే నిలువెత్తు నిదర్శనమన్న...
సమతామూర్తి...సౌజన్యమూర్తి
మా కళారత్న బిక్కికృష్ణ గారికి
వందనం అభివందనం...పాదాభివందనం
అందరిని ఇంతగా ప్రేమించే
మంచి మనసున్న మహారాజు
ఈ శతాబ్దపు మహాకవి...
అభినవ శ్రీకృష్ణ దేవరాయలు...
సభా సామ్రాట్...
మా కళారత్న బిక్కిక్రిష్ణ గారు
అతి త్వరలోనే
ఉన్నతమైన అతి ప్రతిష్టాత్మకమైన
ఓ ప్రభుత్వ పదవిని అలంకరించాలని
ఆ శ్రీ శ్రీ మహాప్రస్థానానికి
ఆ సినారే విశ్వంబరకు ధీటైన
ఈ మార్మిక నది కవితా సంపుటికి
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
దక్కాలని ఆ సరస్వతీదేవికి మ్రొక్కుతూ
ఆ ప్రభుత్వాధికారులను అర్థిస్తూ
ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్న...



