Facebook Twitter
కరోనా కబుర్లు..

ఎక్కడుంది కరోనా ?

ఇపుడేమి చేస్తుంది కరోనా?

 

అతి భయంకరమైన

అతి ప్రమాదకరమైన

అనుకోని అతిథి కరోనా

డాక్టర్లను,నర్సులను 

వెక్కిరిస్తుంది కరోనా

వారి ప్రక్కనే నక్కినక్కి 

తిరుగుతుంది కరోనా

సైనికులను, సైంటిస్టులను

సైతం గజగజ వణికిస్తుంది

గడగడలాడిస్తుంది కరోనా

కళ్ళముందున్న 

శవాల గుట్టలు మీద

'చిందులు" వేస్తుంది కరోనా

"విందులు" 

చేసుకుంటుంది కరోనా

 

ఎంత వేడుకున్నా 

జన్మనిచ్చిన చైనాకు 

వెళ్ళనంటుంది కరోనా

తనకు చావేలేదని

తనకు మందేలేదని

తనకెదురేలేదని 

విర్రవీగుతుంది కరోనా

అగ్రరాజ్యాల 

అణుబాంబులతో 

ఆడుకుంటుంది కరోనా

వికటాట్టహాసం 

చేస్తుంది కరోనా 

విశ్వవిజేతనంటుంది కరోనా

 

"మళ్ళీ వొస్తే" ఈ 

"మాయదారి కరోనా"

ఇక్కడే ఇండియాలోనే 

దానికి "అగ్నిపూజ" చేద్దాం...

ఈ కరోనా "కాలరక్కసిని"

దగ్ధంచేద్దాం...

అందరం కలిసి ఈ 

కరోనా "విషపురుగును"

అంతం చేద్దాం...ఘనంగా 

దీనికి "అంత్యక్రియలు" చేద్దాం..