Facebook Twitter
సెకండ్ వేవ్ కరోనాకు...ఇద్దాం కరెంటు ‌షాక్ .....

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మేమింకా "ఇళ్ళలోనే బంధీలైవున్నది"

ఎందుకో తెలుసా?

రామబాణాలు రెడిచేసుకోవడానికి

నీ పదితలల్ని తగలబెట్టడానికి,

నీపై బాణాలు సంధించి తాళ్ళతో బంధించి

నిన్ను పాతాళంలో పాతిపెట్టడానికి

 

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మేమింకా "క్వారెంటైన్లలో"

వున్నది ఎందుకో తెలుసా?

కత్తులు కటారులు నూరడానికి

నీ ముక్కు చెవులు తెగనరకడానికి

శూర్పణఖలా నీ హాహాకారాలు విని

సంతోషంతో సంబరాలు చేసుకోవడానికి

 

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మేమింకా "ముఖాలకు మాస్కులు"

ధరించి వున్నది ఎందుకో తెలుసా?

నీ ముఖాన ముసుగు వేయడానికి

నీ కళ్ళల్లో కొరివికారం కొట్టడానికి

మేమింకా " సోపుతో చేతులు

శుభ్రం చేసుకునేది" ఎందుకో తెలుసా?

గండ్రగొడ్డళ్ళను పదును పెట్టడానికి

నీ తలను నరికి ఇండియా

గేటుకు వ్రేలాడదీయడానికి

 

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మేమింకా " సెల్ఫ్ ఐసోలేషన్ లో "

వున్నది ఎందుకో తెలుసా?

స్టెన్ గన్ లు సిద్దం చేసుకోవడానికి

కనిపిస్తే నిన్ను కాల్చి పారెయ్యడానికి

 

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మేమింకా "లాక్ డౌన్" నిబంధనలను

పాటించేది ఎందుకో తెలుసా?

నీకు "కరెంటు ‌షాక్ "ఇవ్వడానికి

మేమింకా "ఇళ్ళలో బంధీలైవున్నది"

ఎందుకో తెలుసా?

నీకు త్వరలో "మందు'' కనిపెట్టడానికి

నీకు బొంద పెట్టడానికి.