నిన్న దగ్గు జలుబు జ్వరము
గొంతునొప్పి ఆయాసము వస్తే
మందులతో మాయమైపోయేవి
సంతోషంగా పేషెంట్లు, నవ్వుతూ
హాస్పిటల్ నుండి ఇంటికెళ్ళేవారు
నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం, వింత
విచిత్రం, మనుషులైతే పోతున్నారు,
ఎక్కడికి? ఇంటికా కాదుకాదు,కాటికి
నిన్న ఒకరిని ఒకరు కౌగలించుకునేవారు
వాటేసుకునేవారు, భుజాలకెత్తుకునేవారు
షేక్ హ్యాండ్స్ ఇచ్చేవారు, పుచ్చుకునేవారు
భేష్ శహబాష్ అంటూ, భుజం తట్టేవారు
చేతులతో చెయ్యేసి, ప్రమాణం చేసేవారు
కానీ నేటి పరిస్థితి వేరు దూరం దూరం
ఆరడుగుల భౌతిక దూరమంటున్నారు
మాస్క్ లు ధరించి మాట్లాడమంటున్నారు
ఆలింగనాల్లేవు, ఆప్యాయంగా పలకరింపుల్లేవు
నిన్న రోడ్లమీద విచ్చలవిడిగా తిరిగారు
ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా విహరించారు
నేటిస్థితి వేరు ఇంకా ఇళ్ళల్లో బంధీలైవున్నారు
క్షణక్షణం భయం భయంగా బ్రతుకుతున్నారు
కరోనా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు
కరోనా కరోనా అంటూ అందరు కలవరిస్తున్నారు
నిన్న పాజీటివ్ అంటే ఒక "పవర్ పుల్ ఎనర్జీ"
కానీ,నేడు పాజీటివ్ అంటే ఒక "హెల్త్ ఎమర్జెన్సీ"



