ఓ ప్రియమిత్రులారా !
సరస్వతీ పుత్రులారా !
సాహితీ సంస్కారులారా ! మీది
అజ్ఞానులను "కదిలించే" కవిత్వమా?
అక్రమార్కులను "ఎదిరించే" కవిత్వమా?
అహంకారులగుండెల్లో "నిదురించే" కవిత్వమా?
మీ కవిత్వం ఎవరి కోసం ?ఎందుకోసం ?
మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి
"నిప్పులాంటి కవిత్వం" వ్రాయండి తప్పులేదు
కానీ గుర్తుంచుకోండి ఏ కూరకైనా రుచిఉప్పే
"కదిలించని కవిత్వం" వ్రాయడం తప్పే
"అర్థంకాని కవిత్వం" వ్రాయడం వ్యర్థమే
"కవిత" కమ్మగా "ముగింపు" ముచ్చటగా ఉండాలి
చక్కని "చిక్కని మజ్జిగలాంటి" కవిత్వం వ్రాయాలి
"సందేశామృతాన్ని" కొందరికైనా కొంతైనా పంచాలి
"భావం" గంభీరంగా "ఎత్తుగడ" వినుత్నంగా వుడాలి
ప్రతికవి ఒక నూతన "పదసృష్టికర్త" కావాలి
"రాశికన్నా వాసిమిన్న" అన్న సూత్రం మరువరాదు
అక్షరాలను" కుప్పపోయక అక్షరదీపాలు వెలిగించాలి
ప్రాసల కోసం ప్రాకులాడరాదు
ఎవరి "శైలి వారి సొంతమై" ఉండాలి
కవిత్వం ఎలా వ్రాయాలో తెలుసుకోవాలి
అంశంపై అవగాహనుండాలి "అధ్యయనం" చేయాలి
కవి నిత్యసత్య "సాహిత్యాన్వేషి" కావాలి
ప్రతికవి ఒక "సంఘసంస్కర్తగా" మారాలి
మనిషిని మార్చాలి సంఘాన్ని చైతన్య పర్చాలి
తరువులన్నీ ఫలాలనిచ్చేది పరులకోసమేనన్నట్లు
కవిత్వం "ప్రశంసలకోసం" కాక "ప్రజలకోసం" వ్రాయాలి
కవిత "ఇసుకలో రాతలా" కాక "శిలపై చెక్కినదై" వుండాలి
భువిలో "కవిత మిగలాలి"దివిలో కవి ధృవతారగా "వెలగాలి"



