Facebook Twitter
ప్రతికవి... చిరంజీవి

మొన్న రవిగాంచనిచో 

కవిగాంచునన్నారు

వెలుగులు విరజిమ్మే "రవికన్న" 

సాహితీ వెలుగులు విరజిమ్మే 

"కవిసూర్యుడే మిన్న" అన్నారు

 

నిన్న "కత్తికన్నా కలంమిన్న" అన్నారు 

కత్తిని ఝుళిపించి ప్రత్యర్థులను

బెదిరించి దండయాత్రలతో

రక్తపాతాలను సృష్టించి

రాజ్యాలను ఆక్రమించే రాజుల కన్న

తన కలబలంతో రాజులనే శాసించిన

రాజుల సింహాసనాలనే కుదిపేసిన

రాజ్యాలను గెలిచిన రాజుల హృదయాలనే  

రమణీయమైన తన కావ్యాలతో

రంజింపజేసిన "కవిశేఖరుడే" మిన్నఅన్నారు

 

కానీ నేడు నేనంటున్నాను

కవికి "జనమే కానీ మరణం" లేదని 

రాజులు, రాజ్యాలు పోయినా

కవి మాత్రం "చిరంజీవియే" 

చిరస్మరణీయుడే"నని,కారణమొక్కటే 

కవి వ్రాసిన "అక్షరాలు శాశ్వతం"

కవి రాసిన "కావ్యాలు శాశ్వతం"

వాటికి జీవమే కానీ మరణం లేదాయె 

మరి వాటిని కన్న ఆ కవికెక్కడిది మరణం?

అందుకే "కవికీర్తి" "ఆచంద్రతారార్కం" అంటారు