కంప్యూటర్లో ఇంగ్లీష్ తెలుగు
టైపింగ్ నేర్చుకున్న...నిత్య విద్యార్థి...పీవీ
తన ఆత్మకథను "ది ఇన్సైడర్" గా
ఆంగ్లంలో వ్రాసుకొని తెలుగులోకి
అనువదించబడిన "లోపలిమనిషి"...పీవీ
రవీంద్ర భారతిలో మాడుగుల
నాగఫణి శర్మ సహస్రావధానంలో
పృచ్చకుడిగా పాల్గొన్న సాహితీవేత్త...పీవీ
విద్యాశాఖమంత్రిగా తెలుగు అకాడమీని
స్థాపించిన....తెలుగు భాషాభిమాని...పీవీ
విదేశీ వ్యవహారాల మంత్రిగా
తన సొంత ఖర్చులతో కారును కొన్న
నిస్వార్థ ప్రజానాయకుడు...నీతికి
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.....పీవీ
ప్రతిష్టాత్మకమైన
ప్రధానమంత్రి పీఠాన్ని
అధిరోహించిన
"ఏకైక తెలంగాణ తెలుగు బిడ్డ"
16 భాషలు...
నేర్చిన బహుభాషా కోవిదుడు...పీవీ
అట్టి అపర చాణక్యుడికి
బహుభాషా కోవిదుడికి...
బహుముఖ ప్రజ్ఞాశాలికి...
నిస్వార్థ ప్రజానాయకుడికి...
భారతరత్న పురస్కారం దక్కడంతో...
మాజీ ప్రధాని పాములపర్తి...
వెంకట నరసింహారావు కీర్తి...
మన తెలుగు జాతి ఖ్యాతి...
నింగిలో తారలుగా నిలిచిపోవునుగాక..!
ఆనాడు అధికారుల నిర్లక్ష్యంతో
జరిగిన అంతిమ సంస్కారంతో..!
అసంతృప్తిగా దివికేగిన
ఆ మహనీయుని ఆత్మ
ప్రతిష్టాత్మకమైన ఈ "భారతరత్న"
పౌర పురస్కారంతో...శాంతించును గాక..!



