లోకం మెచ్చిన లోపలి మనిషి...
తెలంగాణ మట్టిలో పుట్టి
విశ్వమంతా
విస్తరించిన రాజకీయ వటవృక్షం...
మన తెలుగువారి
కోహినూర్ వజ్రం...మనపీవీ
అధికార దాహమన్నది లేని
కాగడా పెట్టిన వెతికినా కానరాని
నిష్కలంక దేశభక్తుడు
కులబలం లేని
కుట్రలు కుయుక్తులు ఎరుగని
రాజీపడని రాజకీయ చతురుడు
ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించి
క్లిష్టకాలంలో అలలకడలినీదినట్లు
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని
కదం తొక్కించిన కారణజన్ముడు
మహా రథసారథి...మన పీవీ
లోతైన లోపలి మనిషి నంటూ
తన ఆత్మకథను వ్రాసుకున్న...
విశ్వనాథ వేయిపడగలను
హిందీలోకి అనువదించిన...
సాహితీసార్వభౌముడు..
16 భాషల్లో ప్రావీణ్యతగల
బహుభాషాకోవిదుడు
16 అణాల అచ్చ తెనుగు
తెలంగాణ ముద్దుబిడ్డ ...మన పీవీ
స్వాతంత్ర్య సమరయోధుడు...
వ్యూహరచనా దురంధరుడు...
అపరమేధావి...
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు..
కాకలు తీరిన రాజకీయనాయకుడు...
విజ్ఞతకు స్థితప్రజ్ఞతకు రాజనీతిజ్ఞతకు...
చెక్కుచెదరని ఉక్కుసంకల్పానికి
నిలువెత్తు నిదర్శనం...మన పీవీ
అట్టి అపర చాణక్యుడికి
బహుభాషా కోవిదుడికి...
బహుముఖ ప్రజ్ఞాశాలికి...
నిస్వార్థ ప్రజానాయకుడికి...
భారతరత్న పురస్కారం దక్కడంతో...
మాజీ ప్రధాని పాములపర్తి...
వెంకట నరసింహారావు కీర్తి...
మన తెలుగు జాతి ఖ్యాతి...
నింగిలో తారలై నిలిచిపోవునుగాక..!
ఆనాడు
సంస్కార హీనులైన
అధికారుల నిర్లక్ష్యంతో
జరిగిన అంతిమ సంస్కారంతో...
అవమాన భారంతో...
ఆత్మ క్షోభతో అసంతృప్తితో ...
దివికేగిన ఆ లోపలి మనిషి...
శ్రీ పీవీ నరసింహారావు గారి ఆత్మ
ప్రతిష్టాత్మకమైన ఈ "భారతరత్న"
పౌర పురస్కారంతో...శాంతించును గాక..!
జయహో..!
జయహో..! ఓ జాతినేత..!
పాదాభివందమయ్యా
ఓ పాములపర్తి నారసింహ..!
మీ స్మరణే ! మా అందరికి ప్రేరణ..!
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం..!
మీ ఆశయాలకు అంకితమౌతాం..!
ఓ మహాత్మా..! ఓ భారత రత్నా..!
మీ కిదే మా అక్షర నీరాజనం...!



