Facebook Twitter
జాలి గుండెల్లో ఓ జాతినేత

"అమ్మా" అని
పిలవగానె కమ్మగా పలికె...
"జాలి గుండెల ఓ జాతినేత"..!
ఆనాటి మీ అకాల మరణవార్త...
అయ్యో!"రాతిగుండెలకైనా రంపపుకోత"..!

శాంతి కోసం ప్రతిక్షణం 
పరితపించి...పరితపించి...
"శలవు తీసుకున్న ఓ శాంతిదూత"..!
"మీరులేని ఆ లోటు"...రోదించే
"మా హృదయాలపై రోకటిపోటు"....!

ఆశలుతీర్చి...
ఆడపడుచులకు అండగ నిల్చి...

"అనువులు బాసిన ఓ అమృతమూర్తి”..!

 "అష్టకష్టాకోర్చి అవమానాలెన్నో భరించి "

ఆర్జించి పెట్టావు...మాకు అఖండ కీర్తి"..!

మహిళాజ్యోతివై...
మహిలోన వెలిగి
వింతకాంతులు
విరజిమ్మి ...
విశష్ట సేవలు చేసి...
"దివికేతెంచిన ఓ ధీరవనిత"..!

మరువక నీ త్యాగం...మహిళాలోకం..!

దినదినం స్మరించు....నీ దివ్యనామం..!