ఘల్లు ఘల్లుమని నాట్యమయూరి
వోలె చిందుల్ వేయునురా
...నా తెలుగు భాష
భళ్ళు భళ్ళుమని తెల్లగ తెలవారునురా
...నా తెలుగు భాష
కళ్ళు మిరుమిట్లు గొల్పు గొప్పవెలుగురా
...నా తెలుగు భాష
జల్లు జల్లుమని కుంభవర్షమై కురియునురా
...నా తెలుగుభాష
చెంగు చెంగుమని జింకవోలే దూకునురా
...నా తెలుగు భాష
ఖంగు ఖంగుమని కనకంబువోలె మ్రోగునురా
...నా తెలుగు భాష
గలగల మని గోదావరి వోలె పొంగి పొరలునురా
...నా తెలుగు భాష
మిల మిలమని మింట తారవోలే మెరియునురా
...నా తెలుగు భాష
జుంటి తేనియల కన్న కడు తియ్యనైనదిరా
...నా తెలుగు భాష
అమ్మ ప్రేమకన్న అతి మధురమైనదిరా
...నా తెలుగు భాష
అమ్మపాల కన్న అతి స్వచ్చ మైనదిరా
...నా తెలుగు భాష
అజ్ఞాన తిమిరాన్ని చిరుదివ్వై చీల్చివేయునురా
...నా తెలుగు భాష
దేశభాషలందు బహులెస్సరా సాటిలేని మేటిరాఘ
...నా తెలుగు భాష
భళిరా భళి ప్రపంచ భాషల్లో బాహుబలిరా
...నా తెలుగు భాష
తెలుగు లోగిళ్లకు ఉగాది ఒక ఉషోదయంరా
అట్టి ఉగాదికి ఊపిరిరా ...నా తెలుగు భాష
ఉగాది పర్వదినాన కవిసమ్మేళనాలయాత్ర జరిగేను
తెలుగునేల తెలుగుజాతి మురిసేను
కమ్మని కవితలకు కనకాభిషేకంతో
పసిడి పద్యాలకు పట్టాభిషేకంతో
ఉగాది అంటే... కవితల వర్షం...కవులకు హర్షం



