చేతితో
చక్కని చిత్రాలు
గీయడం కాదు వైరల్ న్యూస్
రెండు చేతులు కోల్పోయినా
నోటితో అపురూపమైన
చిత్రాలను గీయడమే...
షాకింగ్ షేకింగ్&హార్ట్ బ్రేకింగ్ న్యూస్
ప్రపంచ పారా
(వికలాంగుల)
ఒలింపిక్స్ పోటీలలో
రెండు చేతులు కోల్పోయిన
శీతల్ దేవి తన రెండు కాళ్ళతో
విల్లును ఎక్కుపెట్టి
నోటితో బాణాలను సంధించి
రెండు బంగారు పతకాలను సాధించడం...
మన భరతమాత ముద్దుబిడ్డగా
భారతీయులందరూ గర్వపడేలా
విశ్వమంతా విస్మయం చెందేలా
మన భరతజాతి
త్రివర్ణ కీర్తిపతాకను
వినువీధుల్లో ఎగురవేయడమే...
షాకింగ్ షేకింగ్&బ్రేకింగ్ న్యూస్
జయహో..!
జయహో..! శీతల్ దేవి..!
నిన్ను వరించని ఆ విజయాలేవి?
విజయాలనడ్డుకునే ఆ శాపాలేవి?
నీవే యువతకు అనంత స్ఫూర్తి..! అజరామరం నీవు
ఆర్జించిన అఖండ కీర్తి..!
ఈ శీతల్ దేవి శుభసందేశం ఒక్కటే..!
సాధన శిక్షణ కసి కృషి పట్టుదలలే వుంటే..!
అంగవైకల్యం ఒక శాపము పాపము కాదని
అదిభగవంతుడు ప్రసాధించిన ఓవరమని..!



