ఓపిక ఉన్నంతవరకు కాదు కాదు
ఊపిరి ఉన్నంతవరకూ పోరాడాలి
పోరాడితే పోయేదేముంది చెప్పండి
మన బానిసత్వపు సంకెళ్ళు తప్పవన్న
నివురుగప్పిన నిప్పులాంటి...నినాదంతో...
సాహసమే ఊపిరిగా...ఆశయాలే ఆకలిగా
గడ్డి కరిచే దొరలను దోచుకునే దొంగలను
ఫామ్ హౌస్ కే పరిమిత చేయాలన్న
గడీల గద్దలను గద్దె దించాలన్న లక్ష్యంతో
వ్యూహకర్త సునీల్ కనుగోలు అందించిన
ఆరుగ్యారెంటీల అస్త్రాలతో ముందుకురికిన
ఓ ఉయ్యాలవాడ ఉగ్రనరసింహుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
కన్న కూతురు పెళ్ళికి హాజరై
అక్షింతలు జల్లి ఆశీర్వదించేందుకు
అడ్డు పడిన బద్దశత్రువులను
ఒటు హక్కునే గండ్రగొడ్డలితో నరికి
కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసిన
"వేయ్యేనుగుల బలమున్న ఓ వేటగాడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
ఓటుకు నోటు కేసుతో
రాటుదేలి మదపుటేనుగై
గులాబీ కొండనే డీకొట్టిన...
ఓ కొండారెడ్డిపల్లి కొదమసింహమా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టి
అమ్మపాలు త్రాగి అమ్మ రొమ్మును గుద్దిన
మోసకారిని అధికార దురహంకారిని
ఎన్నికల సమరంలో మట్టి కరిపించిన
ఓ సాహస వీరుడా! ఓ విక్రమార్కుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
ముఖ్యమంత్రికే సవాల్ విసిరి పోటీకి దిగి
రాహుల్ ప్రియాంకా గాంధీలతో కలిసి
85 సభల్లో సుడిగాలి పర్యటనలు చేసి
ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ఓటర్లను
ఆకట్టుకొని ...సభావేదికలు దద్ధరిల్లేలా
ఉద్వేగ పూరితమైన ప్రసంగాలతో
తెలంగాణ ప్రజల్ని ఉత్తేజితులను చేసిన
ఉర్రూతలూగించిన ఓ ఉద్యమ సూర్యుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం...
మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో
కర్నాటక తరహాలో తెలంగాణలో సైతం
64 సీట్లతో సంపూర్ణమైన మెజారిటీతో
కాంగ్రెస్ జెండాను తెలంగాణాలోఎగరేసిన...
విజయభేరీ మ్రోగించిన ఓ విప్లవ వీరుడా..!
ఓ బాహుబలీ..! ఓ రేసుగుర్రమా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
(యువనేత డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా
ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా
అందిస్తున్న అక్షర కుసుమాంజలి....)



