తెలంగాణ ప్రజా
ఉద్యమ స్ఫూర్తికి
ప్రతిరూపం...మన కాళోజీ...
ముక్కుసూటిగా జీవించి
కవిత్వం రాసిన
కవీశ్వరుడు...మన కాళోజీ...
నిజాం నిరంకుశ పాలనపై
కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి
స్వాతంత్య్ర సమరయోధుడు
పద్మ విభూషణుడు...మన కాళోజీ
ప్రజా ఉద్యమ ప్రతిధ్వని
తెలంగాణ తొలి పొద్దు...మన కాళోజీ.
అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి...
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తిప్రాప్తి...
అన్యాయాన్నెదిరించిన
వాడే నాకు ఆరాధ్యుడు...
అంటూ ఉద్యమమే
ఊపిరిగా జీవించిన
ప్రజాకవి...మన కాళోజీ
ఎక్కడో కర్ణాటకలో పుట్టిన...
తెలంగాణ మట్టిలో పెరిగిన...
రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్
శ్రీనివాసరాం రాజా కాళోజీ...
సాహితీ సూర్యుడై చేసిన
తెలంగాణ విమోచనోద్యమాలను
మనం నిత్యం స్మరించుకోవాలి
యువతకు వారు స్పూర్తి ప్రదాత
అందుకే యువశక్తి
వారి అడుగు జాడల్లా నడవాలి
వారి ఆశయాలకు అంకితం కావాలి
అదే ఆ ప్రజాకవికి మనమిచ్చే
నిజమైన ఘనమైన నివాళి....



