Facebook Twitter
మానవత్వాన్ని చాటుకుందాం...

ఆ ఇద్దరూ తెల్లని చల్లని దేవతలే

ప్రేమకు ప్రతిరూపాలే నిస్వార్థ సేవకు 

నిలువెత్తు నిదర్శనమైన మథర్ తెరిస్సాలే, 

ఐతే ఆ ఇద్దరు కంట నీరు పెట్టుకున్నారు

 

తన కరోనాసేవలకు గుర్తింపుగా

సంఘీభావంతో,తలపై పూలవర్షం కురిపిస్తూ

అభిమానంతో,గౌరవంతో, కరతాళధ్వనులతో, 

Hearty Welcome to our Apartment

My dear Doctor We are Proud of You 

God Bless You & give you long life

అంటూ,అపార్ట్ మెంట్లోకి అందరూ

ఆత్మీయంగా ఆహ్వానించినందుకు 

ఉద్వేగానికి గురై, ఉక్కిరి బిక్కిరై 

కంట కన్నీరు పెట్టుకుంది...ఒక దేవత...

 

అవి ఆనందబాష్పాలే...

మరిచిపోలేని మధుర జ్ఞాపకాలే...

 

కానీ అపార్ట్ మెంట్ లోనికి వెళ్ళడానికి 

అనుమతివ్వకపోగా అడ్డుపడి,దాడిచేసి

No Entry to our Apartment

You Corona Devil Get Out

అంటూ,అందరూ దుర్భాషలాడినందుకు,

దూరంగా నెట్టి వేసినందుకు 

ఆవేదనతో, అవమానంతో

కుంగిపోయింది కుమిలిపోయింది

కంట కన్నీరు పెట్టుకుంది మరో దేవత....

ఇది మానవత్వానికే ఒక మాయని మచ్చ...

 

ఔరా కరోనాకాలసర్పం కళ్ళముందేవున్నా 

లెక్కచేయక ఉద్యోగమే ఊపిరిగా

తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి  

నిస్వార్థంగా నిర్విరామంగా సేవలందించి

మృత్యువుతో యుద్ధం చేసి కాటికి సిద్దమైన     

కరోనారోగులకు ప్రాణం పోసిన,పునర్జన్మనిచ్చిన

ఆ పుణ్యమూర్తులేగదా మనకు ప్రత్యక్ష దైవాలు

 

ఆ డాక్టర్లను,ఆ నర్సులను,

ఆ పోలీసు సిబ్బందిని,

ఆ పారిశుద్ధ్య కార్మికులను,

మనసారా అభినందిద్దాం, రండి,రండి  

రెండు చేతులెత్తి మొక్కుదాం, రండి,రండి

పాదాలకు పాలాభిషేకం చేసి 

వారి ఋణం తీర్చుకుందాం రండి,రండి

మానవత్వాన్నిచాటుకుందాం రండి రండి,మనం

మనుషులమని ఋజువు చేసుకుందాం రండి రండి