Facebook Twitter
ఓ మనిషీ ! ఒక నిజం తెలుసుకో !!..

ఓ మనిషీ ! 

ఒక నిజం తెలుసుకో !!

జీవితమంటేనే 

ఒక జననం ఒక మరణమని

మధ్యలో జీవనం 

నడిసంద్రంలో నావ ప్రయాణమని

 

ఓ మనిషీ !

ఒక నిజం తెలుసుకో !!

నీవు బ్రతికినంత కాలం

మానవత్వంతో జీవించు

మనిషిలా ఆలోచించు,

స్థితప్రజ్ఞతను ప్రదర్శించు,

స్వీయనియంత్రణను పాటించు

నీ శతృవైన కరోనాను

కనిపిస్తే కాల్చివెయ్

 

ఓ మనిషీ ! 

ఒక నిజం తెలుసుకో !!

నీవ బ్రతికినంత కాలం

చీమలా అన్వేషించు

డేగలా విహరించు,

పువ్వులా పరిమళించు,

సింహంలా గర్జించు, 

పులిలా గాండ్రించు,

ఏనుగులా ఘీంకరించు, 

సూర్యుడిలా ప్రకాశించు

నీ శతృవైన కరోనాతో 

యుద్ధానికి సిద్ధంగావుండు

 

ఓ మనిషీ ! 

ఒక నిజం తెలుసుకో!

కంటికి కనిపించని ఈ 

కరోనా ఒక మృత్యువై 

నిన్ను కబళించి వేస్తుందని, 

కలవరపడకు, కంగారుపడకు, 

భయపడకు, బాధపడకు

 

రేపు, చీకటిని చీల్చుకుకొని 

వెలుగురేఖలు విచ్చుకునే వేళ

కొమ్మళ్ళో కాకులరుస్తాయి

                కావుకావుమని....

దానర్థం,కరోనా కష్టాలిక నీకు

                రావురావు అని....

కరోనా చావులు నీకిక 

                 లేవులేవు అని....