Facebook Twitter
మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు?

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? 

బాలకా ! ఓ బాలికా ! నేను మీ 

ఊరి మోటుబావి "గిలకను" 

అయితే బావిలో నీరుతోడి 

మా దాహం తీర్చవా ?

ఓకే.....ఓకే.....థ్యాంక్యూ.....థ్యాంక్యూ

 

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? 

బాలకా ! ఓ బాలికా ! నేను

మీ పంజరంలోని పంచదార "చిలకను" 

అయితే మా కోసం ఒక మంచి 

పాట పాడి వినిపించవా ?

ఓకే.....ఓకే.....థ్యాంక్యూ....థ్యాంక్యూ 

 

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు ?

ఓ బాలకా ! ఓ బాలికా ! 

నేను మీ బోసినవ్వుల తాత "పిలకను" 

అయితే మాతో వస్తావా మా ఇంటికి 

తాతయ్యతో బోలెడు కథలు చెప్పిస్తాం

ఓకే.....ఓకే.....థ్యాంక్యూ....థ్యాంక్యూ 

 

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? 

ఓ బాలికా ! ఓ బాలికా ! 

నేను మీరు రోజు బడికి మోసుకుపోయే "పలకను" 

అయితే మాకు అ...ఆ...ఇ...ఈ.. లు నేర్పిస్తావా  ?

ఓకే.....ఓకే.....థ్యాంక్యూ.....థ్యాంక్యూ