చిత్ర కవిత…
టిప్పుసుల్తాన్ వాడిన
కత్తి ఖరీదు 143 కోట్లు..?
అప్పుడు టిప్పుసుల్తాన్
మిలమిల మెరిసే ఆ కరవాలంతో...
ఎన్ని శిరస్సులను చేధించాడో...
ఎదురు తిరిగిన ఎంతమంది
అమాయకులను ఖతం చేశాడో...
ఎవరికెరుక...ఆ అల్లాకు తప్ప
ఇప్పుడది 143 కోట్ల ధర పలికింది...
ఆహా ఆ కత్తికెంతటి గౌరవం దక్కింది...
దానికి కారణం ఆ కత్తిని తయారు
చేసిన ఆ కళాకారుని నైపుణ్యమే కదా...
తన శత్రువులు ఎవరు ఎప్పుడు
ఏ వైపునుండి దూసుకు వస్తారో
అంచనాలకందక ఆత్మరక్షణకోసం
కత్తిని పడకగదిలో భద్రంగా దాచుకున్న
టిప్పుసుల్తాన్ ...పాపం కంటినిండా
ఏనాడు కునుకు తీసి ఉండడేమో...
రోజూ"కలత" నిద్రే...
రోజు "పీడకలలే" కాబోలు...కారణం
ఆర్జించిన ఆస్తిఅంతా పరులపాలై
పోతుందన్న అనుమానం...
క్షణక్షణం శత్రువులనుండి ప్రాణభయం...



