Facebook Twitter
మరువలేని...మరణం లేని మహాగాయకుడు మన సాయిచందు..!

ఓ ప్రతిశీల ప్రభంజనమా..!
ఓ అరుణోదయ కిరణమా..!
ఓ పాలమూరు పాటగాడా..!
ఓ బహుజన బాటసారి..!
నీ కన్నీటి పాటతో చూపావే
ఎందరికో బంగారు బ్రతుకు దారి..!

ఓమా బంగారుబిడ్డా ! ఓ సాయిచందు..!
అణగారిన బడుగు బలహీన వర్గాల గొంతుకవై ఎందరికో అండగా నిలిచావే..!

సింగరేణి కార్మికుల కన్నీటి గాథలను పాలమూరు ప్రజల వలస జీవితాలను కమ్మని పాటలు రూపంలో కళ్లకు కట్టిన
నీ కంఠస్వరం నేడు...మూగబోయిందే...

నీ పాట ఒక తూటై...
నీ ఆట ఒక పూలబాటై...
నీ మాట ఒక తేనెలఊటై...
నీ ప్రతి పాట మా గుండెల్లో...
నిత్యం మారుమ్రోగుతూనే ఉంటుంది
నిత్యం నీ పేరు వినిపిస్తూనే ఉంటుంది
నిత్యం నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది
ఓ మా బంగరు బిడ్డా..! సాయిచందు..!
లేదయ్యా లేదు..! నీకు మరణం లేదు..!

ఆ సూర్య చంద్రులు
ఆ నక్షత్రాలున్నంతకాలం..!
నీవు భౌతికంగా దూరమైనా
నీ పాటలే నీకు ప్రాణం పోస్తాయి...
ఓ సాయిచందు నీవు బ్రతికే ఉంటావు..!
నీవు తెలంగాణ ప్రజల గుండెల్లో...
ఆరనిజ్యోతిలా వెలుగుతూనే ఉంటావు..!
నీ అకాలమరణవార్త...
మన తెలంగాణాతల్లికి ఓ గుండెకోతే..!

ఓ బిడ్డా ! నీ ఆత్మకు శాంతి కలుగును గాక !
జోహార్ జోహార్..! సాయీ చందు జోహార్..!
అమర్ రహే..!అమర్ రహే ..!
సాయీ చందు అమర్ రహే..!