Facebook Twitter
పాటే ప్రాణంగా..!ఉద్యమమే ఊపిరిగా..!

అయ్యో ఓ దైవమా..! 
అమర గాయకుడు
తెలంగాణ ఉద్యమానికి ఉపిరైన
సాయిచందు హఠాన్మరణమా..!
తన మధురగాత్రంతో ఎన్ని హృదయాలనో
దోచిన ఆగుండెఅర్ధాంతరంగా ఆగిపోయిందే

తన పాటను విను ప్రతివారిని
కదిలించే...కరిగించే మదిని మురిపించే...
ఆ మధుర స్వరం మాయమై పోయిందే...

యువతలో స్ఫూర్తి జ్వాలలు రేపుతూ
బహుజనులకి కొండంత అండగా నిలిచిన
ఆ కమ్మని కంచుకంఠం మూగబోయిందే...
ఇంత దయలేనివాడా...ఆ దైవము...?

రాజకీయాలలో రాణిస్తున్న
ఎవరెస్టు శిఖరంలా ఎదుగుతున్న
మన సాయి చందును ఎత్తుకెళ్లిందే...
ఇంత క్రూరమైనదా...ఆ మృత్యువు..?

ముద్దుబిడ్డల్నిద్దర్ని అనాధలను చేసి... ముచ్చటైన పచ్చనికాపురాన చిచ్చురేపి
నిత్యం చిరునవ్వులు చిందించే...
చిలుకా గోరింకలైన అమర ప్రేమికులైన
ఆ సాయి రజనీని విడదీసి విషపునవ్వు నవ్విందే ! ఆవిధి ఎంతటి కసాయిదో కదా..!

ఓ దైవమా..!
ఈ జీవితం ఇంత క్షణికమా..!
నిముషంలో పుట్టి నిముషంలో
మాయమయ్యే నీటిబుడగేనా !
ఆ వింతవిధి చాటుమాటుగా
కాటువేసే పాము పడగేనా!
ఒక క్షణం చిరునవ్వులా..!
మరుక్షణం చితిమంటలా..!
ఎంతగా శోధించినా అర్థం కాకున్నదే...!
ఈ ప్రకృతి ధర్మం..! నీ సృష్టి మర్మం..!