ఓ బహుజన బాటసారి..!
ఓ అంబేద్కర్ అభిమాని..!
ఓ పాలమూరు పులిబిడ్డా..!
చీకట్లో వెలిగే ఓ చిరుదీపమా..!
జలజల దూకే ఓ జలపాతమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగభగ మండే ఓ అగ్నిపర్వతమా..!
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
ఓ విప్లవ వీరుడా..!
ఓ ఉద్యమ సూర్యుడా..!
నీ "అకాలమరణవార్త"
కోట్లాదిమంది అభిమానుల
గుండెల్లో పేలిన"అణుబాంబు" ..!
ఓ గాన గంధర్వా..!
ఓ అమర గాయకుడా..!
నీ పాటతో చైతన్యం పుట్టాలని...
నీవు చట్టసభల్లో అడుగు పెట్టాలని...
కమ్మని కలలు కంటూ కన్నుమూశావా..?
ఓ సాయిచందు..!
ఓ సాహస వీరుడా !
పుట్టాలయ్యా..! పుట్టాలి..!
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి..!
ఎగిరే తారాజువ్వవై..!
రగిలే నిప్పురవ్వవై...!
రణభేరి మ్రోగిస్తూ రణసూర్యుడవై..!
రావాలయ్యా..! రావాలి..!
దివినుండి భువికి నీవు దిగి రావాలి..!
కావాలయ్యా..! కావాలి..!
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి..!



