"భారత రత్నగా"
భారత ప్రభుత్వం
విశిష్ట పురస్కారంతో గౌరవించిన...
భారత రాజ్యాంగ నిర్మాతగా
భావి భారత స్పూర్తి ప్రదాతగా
భారతీయులందరూ కీర్తించిన...
"మహామేధావి"గా
ప్రపంచమే గుర్తించిన...
"అందరివాడు...అజాత శతృవు"...
"అందరికి ఆత్మ బంధువువైన"...
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని
గుండెల్లో దాచుకుందాం...
ఇష్టదైవంగా...
గుర్తుచేసుకుందాం...
ఇలనైనా...కలనైనా మరువక...
ఆ ప్రేమమూర్తి నుండి...
ఆ గాయాల గని నుండి...
ఆ త్యాగాల ధ్వని నుండి ...
ఆ చైతన్య శిఖరం నుండి...
ఆ సమతామూర్తి నుండి ...
స్పూర్తిని పొందుదాం...
సుఖమయ జీవితం జీవిద్దాం...
ఎక్కడ...
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు...
రెక్కలు కట్టుకుని
"విహంగాలై" విహరిస్తున్నాయో...
ఎక్కడ...
సమన్యాయం ...
"చల్లని వెన్నెలై" కురుస్తున్నదో...
ఎక్కడ...
సమానత్వం...సౌభ్రాతృత్వం "మలయమారుతాలై" వీస్తున్నాయో...
ఎక్కడ...
మనిషి మనిషిలో
మంచితనం...మానవత్వం "సుగంధ పరిమళాలై" వెదజల్లబడుతున్నాయో...
అక్కడికి "సమతా భావాలతో"
అందరం ముందుకు సాగిపోదాం...
అక్కడే వెలసిన "మమతల కోవెలలో"
సమిష్టిగా"మధుర గీతాలను" ఆలపిద్దాం...



