Facebook Twitter
బ్రిటిష్ రాజదంపతుల పట్టాభిషేకం..?

ప్రపంచదేశాలకే...
ప్రజాస్వామ్యపాఠాలు నేర్పిన
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో...
ఆర్భాటంగా...అట్టహాసంగా...
అంగరంగ వైభోగంగా...
లండన్ వెస్ట్ మినిస్టర్ అబేలోని చర్చిలో...

2000 మంది విదేశీ అతిథుతుల నడుమ
కింగ్ చార్లెస్...3"ఈ ప్రమాణ స్వీకార...కిరీట
ధారణ...పట్టాభిషేక...మహోత్సవమేమిటి ?

74 ఏళ్ల చార్లెస్...700"సంవత్సరాల నాటి
సింహాసనంపై ఆసీనులు కావడమేమిటీ..?

అతి బరువైన...అతి పురాతనమైన
"బంగారు అంగవస్రాన్ని"ధరించడమేమిటి..?

జెరూసలేం నుండి తెచ్చిన"పవిత్ర తైలాన్ని"
రాజదంపతులపై...చిలకరించడమేమిటి..?

కింగ చార్లెస్ కి 360" సంవత్సరాలనాటి
వజ్రాలు పొదిగిన "కిరీట ధారణ" ఏమిటి..?

ఒక చేతిలో "రాజముద్ర"...
మరో చేతిలో "రాజదండం" ఏమిటి..?
బంగారు గుర్రపుబగ్గీలో ఊరేగడమేమిటి..?

బకింగ్ హామ్ ప్యాలెస్ బాల్కనీ నుండి
"దివినుండి దిగివచ్చిన దేవతల్లా దేవుళ్ళా "
ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వడమేమిటి..?

అతిపురాతనమైన
ఈ రాచరికపు ఆచారాలేమిటి..?
హారతి కర్పూరంలా
ఈ కోటానుకోట్ల ఖర్చేమిటి..?

ఈ ఆధునిక సమాజంలో...
ఈ కంప్యూటర్ యుగంలో...
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ఏమిటి ఈ రాచరికపు "రచ్చ"...?
పట్టాభిషేకం పేర ప్రజాస్వామ్యానికి
కాదా ఇది ఒక మాయని "మచ్చ"...?
అందుకే ఈ రాచరికపు రాజకీయాలు వద్దు
ప్రజాశ్రేయస్సు కోరే ప్రజాస్వామ్యమే ముద్దు