ఈ రెండు
విశ్వనాథుని
వీడియోలను
తిలకించిన చాలు...
ఒళ్ళు పులకించిపోతుంది...
హృదయం ఉప్పొంగిపోతుంది...
ఆహా ఏమీ సందేశం..!ఏమీ సంగీతం..!
ఏమి సాహసం..!ఏమి ముందుచూపు..!
వెండితెర సాక్షిగా...సాక్షాత్తు
ఆ ఈశ్వరుడే.....ఆ పరమేశ్వరుడే...
ఆ శ్రీనివాసుడే...ఆ శ్రీకృష్ణ భగవానుడే...
కళాతపస్వి...
వెండితెర వేల్పు...
బహుముఖ ప్రజ్ఞాశాలి...
మన తెలుగుజాతి జ్యోతియైన...
ఈ కాశీవిశ్వనాధుడి రూపంలో...
ఆ దివినుండి ఈ భువికి దిగివచ్చి...
ప్రశంసలవర్షం కురిసేలా...
ప్రపంచమంతా పరవశించేలా...
తెలుగువారంతా తలెత్తుకు తిరిగేలా...
అంధవిశ్వాసుల కళ్ళు తెరిపించేలా...
మతచాంధస్సులకు కనువిప్పుకలిగించేలా..
విమర్శకులతో సైతం ప్రశంసలు పొందేలా...
వెండితెర నటులచే...కళాకారులచే
ఎంతో సాహసం చేసి...ఎంతో రిస్క్ తో
తరతరాలుగా ఈ మానవ సమాజంలో...
పెరిగిపోయే తారతమ్యాలకు వ్యతిరేకంగా...
మనుషులంతా ఒక్కటేనని...
మన"కులం మానవకులమని"...
మనందరం ఆ పరమాత్మ బిడ్డలమని...
కులమతాల అడ్డుగోడల్ని కూల్చివేయాలని
కులమనే విషవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా
పెకలించివేయాలని...కూల్చికాల్చివేయాలని
అందరి ఆశ...శ్వాస...ఒకటేనని...
అదే మంచితనం...మానవత్వమని...
అదే సమానత్వం...సౌభ్రాతృత్వమని...
అందరూ సోదరభావంతో కలిసిమెలిసి
హాయిగా...ప్రశాంతంగా...జీవించాలని...
సామాజిక రుగ్మతలను
సమాధి చేయాలని...
ప్రజాస్వామ్య పునాధులపై
నవసమాజాన్ని నిర్మించాలని ...
ఏనాడో "సప్తపది" చిత్రంతో
అద్వితీయంగా...అపురూపంగా
అమరశిల్పంలా చెక్కిన ఆ కళాఖండంతో...
అమృతభాండంలాటి...అజరామరమైన
ఓ దివ్యసందేశాన్ని ఈవిశ్వానికి అందించిన
ఈ ఖాకీదుస్తుల కళాతపస్వికి...
ఈ విశ్వంభరునికి...ఈ విశ్వనాథుడికి...
ఈ కళామతల్లి ముద్దుబిడ్డకి...
ఈ విశ్వనరుని విశ్వరూపానికి...
తెలుగుజాతి మొత్తం...
చేతులు జోడించి...శిరస్సులు వంచి
పాదారవిందాలకు ప్రణమిల్లాలి...అదే
ఆ"దర్శక దిగ్గజానికి"అశృనయనాలతో...
మనం అర్పించే...ఘనమైన నివాళి...



