వేదాలన్ని వెతికి వెతికి సనాతన పురాతన
పురాణ గ్రంధాల పుటలెన్నో ఉటంకించి
వివాదాస్పద రామజన్మభూమిని
కళ్ళులేని న్యాయదేవత కళ్ళకు చూపించి
కోర్టులోని న్యాయవాదుల కళ్ళు తెరిపించి
మీరిచ్చిన నిప్పులాంటి సాక్ష్యమే నాటి
అయోధ్య తీర్పుకు...నేటి రామమందిర నిర్మాణానికి నాందియట...
జయహో ! జయహో !
ఓ జగద్గురు రామభద్రాచార్యా జయహో !
భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్తలుగా... విద్యావేత్తలుగా...సంస్కృత పండితులుగా...బహుభాషాకోవిధులుగా...
కవులుగా...రచయితలుగా... వచన వ్యాఖ్యాతలుగా...తత్వవేత్తలుగా... స్వరకర్తలుగా...గాయకులుగా...నాటక రచయితలుగా...కథా కళాకారులుగా...
బహుముఖ ప్రజ్ఞాశాలురుగా...
ఈ కలియుగాన వెలసిన
"అంధుల ఆరాధ్య దైవంగా"...
విద్యయే మన "జ్ఞాననేత్రమని" విశ్వానికే
సందేశం మిచ్చి "విశ్వమత గురువులుగా"...
ఖండాంతర ఖ్యాతి నార్జించారట..!
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !
"అంధుల శ్రేయస్సే" ధ్యేయంగా...
"అంధుల సంక్షేమమే" లక్ష్యంగా...మీ
జీవితాన్ని అంధులకోసమే అంకితంచేసి
అంధుల ఆరాధ్యదైవమైన
ఓ జ్ఞాన నేత్రా !
ఓ దివ్య చరితా !
ఓ పుణ్య పురుషా !
ఓ దైవాంశ సంభూతుడా !
మీకు వందనం...పాదాభివందనం...
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !



