విపత్తులో విశ్వం...
ఇది ఏ
విధి ఆడిన
వింత నాటకమో,గాని
విషక్రిమొకటి ఈ నేలపై పుట్టింది
విమానాలలో
విచ్చలవిడిగా
విహరించే నరులపై
విసిరింది తన పంజా
విశ్వమంతా
విస్తరిస్తుంది
విర్రవీగుతుంది
విజృంభిస్తుంది, దీని
విషపు కోరలకు చిక్కినవారు
విలవిలలాడిపోతున్నారు ఓ
విపత్తులా
విరుచుకుపడి ఒక మృత్యువై
విలయతాండవం చేస్తుంది
వికటాట్టహాసం చేస్తుంది
విషాన్ని చిమ్ముతుంది,
విషాదాన్ని నింపుతుంది
విధ్వంసాన్ని సృష్టిస్తుంది
విస్తుపోయేలా ప్రపంచమంతా
వినిపిస్తుంది మరణం మృదంగం
వినడమే కాని కంటికి కనపడని
వికృతమైన
విచిత్రమైన ఈ
విషక్రిమి
విరుగుడుకోసం ఈ
వింత వ్యాధి అంతంకోసం
విశ్వమంతా ఏకమై
విశ్రమించక శ్రమిస్తుంది
విజయం కాంక్షతో వాక్సిన్ కోసం
విశ్వప్రయత్నమే చేస్తోందొక టీకా కోసం



