ఓ నాయకులారా !
నయవంచకులారా !!
నిగ్రహం కోల్పోయి ఓటర్లు
ఆగ్రహిస్తే ఉగ్రరూపం దాలిస్తే
రెప్పపాటులో ఎంతటి
కాకలు తీరిన నాయకులైనా
కుప్పకూలిపోతారు
కాలగర్భంలో కలిసిపోతారు జాగ్రత్త ఇది
చరిత్రనేర్పిన గుణపాఠం గుర్తుంచుకోండి !
అందుకే ఓ ఓటరన్నా...
ఏ నాయకులైతే నిన్ను ఆపదలో ఆదుకుంటారో
ఏ నాయకులైతే ప్రజల శ్రేయస్సును సంక్షేమాన్ని
దేశ ఔన్నత్యాన్ని కాపాడుతారో... అజాతశత్రువులో
ఏ నాయకులైతే అందరివారో... ఆత్మబంధువులో
ఏ నాయకులైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో
ఏ నాయకులైతే ఆపన్నహస్తం అందిస్తారో
ఏ నాయకులైతే సమస్యలకు తక్షణమే స్పందిస్తారో
ఏ నాయకులైతే నిద్రాహారాలుమాని నిస్వార్ధంగా నీతినిజాయితీగా ప్రజలకు నిరంతరం సేవచేస్తారో
ఏ నాయకులైతే త్యాగగుణం... దానగుణం
మంచితనం... మానవత్వం కలిగిఉంటారో
అట్టి వారికే నీవోటేయ్యాలి వారినే నీవు గెలిపించాలి
ఆ గెలుపు ఆ నాయకులది కాదు... నీదే
ఆ సన్మానాలు సత్కారాలు వారికి కాదు....నీ ఓటుకే
ఆ ఘనవిజయం ఆ గొప్పదనం వారిది కాదు...నీ ఓటుదే



