నేడు నేతలు వొంగి వొంగి దండాలు
పెడుతుంటే ఓటర్లు పొంగి పొంగి పోతారు
కానీ రేపువారే అధికారం దక్కగానే
కుర్చీఎక్కి కులుకుతారు కుబేరులౌతారు
ఈ అమాయకపు అజ్ఞానపు ఓటర్లే రేపు
ఆకలికి అలమటించే అస్థిపంజరాలౌతారు
ఆగ్రహంతో ఓటర్లు ఉగ్రరూపం దాల్చితే
రెప్పపాటులో రాజ్యాలు కుప్పకూలిపోతాయి
ఓ ఓటరన్నా నీ ఓటు విలువను తెలుసుకో
నీ వేలుతోనే నీ కంటిని నీవు పొడుచుకోకు
నీ వేలుకు రాసిన సిరాచుక్కతో నీవు
అవినీతి నేతలకు చుక్కలు చూపించవచ్చు
వారుకన్న కలలను కల్లలుచేయవచ్చు
వారి జాతకాలను తారుమారు చేయవచ్చు
జరిగే ప్రతిఎన్నికల్లో నీవే గెలవాలి
ప్రజాశక్తికి నీవే ప్రతిరూపం కావాలి
ప్రజాస్వామ్యానికి నీవే పునాది వేయాలి
నీచేతిలోని ఓటే నీకు వజ్రాయుధం కావాలి
నీవే అవినీతినేతల అంతుచూసి వారిని ఉరితీయాలి
నీతిగల నేతల సుపరిపాలనకు నీవే ఊపిరి పోయాలి
ఓర్పు నశించిన ఓటర్లే...తీర్పుచెప్పేది...మార్పుకోరేది



