Facebook Twitter
ప్రాణాల మీద ఆశవున్న ప్రతి ఒక్కరికోసం..

మిత్రులారా ! ఈ సందేశం మీ కోసం...

ప్రాణాల మీద ఆశవున్న ప్రతి ఒక్కరికోసం...

మనమిప్పుడు ఎవరూ ఎన్నడూ వూహించని

అత్యంత ప్రమాదకరమైన అతి భయంకరమైన

క్లిష్టపరిస్తితుల్లో చిక్కుకు పోయివున్నాం

 

ఇప్పుడు మనం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్నాం 

నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో వున్నాం

బిక్కు బిక్కు మంటూ భయంతో బ్రతుకుతున్నాం

ఈ దుస్థితి మన శతృవులకు సైతం రాకూడదు

 

ప్రతిఒక్కరి ప్రాణాలకు పెను ముప్పు వచ్చిపడింది

సాక్షాత్తు ఆ మృత్యువే వచ్చిమన ముందర నిలిచింది

మందులేని కరోనా వచ్చింది మనకు కష్టాలు తెచ్చింది

 

ఔను మన ప్రాణాలు అందరి చేతిలో పున్నాయి

ఆ అందరి ప్రాణాలు మన చేతుల్లో వున్నాయి

 

ఈ విపత్కర,విచిత్ర వినాశకర పరిస్థితిని ఎదుర్కోవడానికి

ఈ ప్రమాదం నుండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి

ఈ ముప్పు నుండి తప్పించు కోవడానికి మార్గమొక్కటే

 

బయటికెళ్ళకుండా లక్ష్మణరేఖ గీసుకొని

తలుపులు మూసుకొని అందరికీ దూరంగా

మన ఆత్మీయులకు దగ్గరగా వుండాలి

కొంతకాలం ఇంటిలోనే బంధీలై పోవాలి

 

మిత్రులారా ! ఇది మీకు తెలియంది కాదు

బయటికి పోయిన మేకపిల్లను ఏ తోడేలోతినేసినట్లు

బయటికి పోయిన కోడిపిల్లను ఏ గద్దో ఎత్తుకు పోయినట్లు

బయటికి పోయిన జింక పిల్లను ఏ చిరుతపులో చంపేసినట్లు

బయటికి పోయిన కప్పపిల్లను ఏ త్రాచుపామో మింగేసినట్లు

 

బయటికి పోతే మన నెత్తిన పిడుగు పడినట్లే

మన ఇంటికి మనం నిప్పు పెట్టు కున్నట్లే

మన మీద మనం  బాంబులేసుకున్నట్లే, కాలు

బయటపెడితే మనం కరోనా రక్కసికి బలైపోయినట్లే 

మిత్రులారా !జాగ్రత్త !!తస్మాత్ జాగ్రత్త !!!