Facebook Twitter
కరోనాతో యుద్ధం చేద్దాం...

ఉరుములు ఉరిమి 

మెరుపులు మెరిసి

అకస్మాత్తుగా పంటపొలంలో  

పిడుగుపడి ఏర్పడే అగాథాన్ని 

ఎలాగైనా పూడ్చవచ్చు

 

కానీ ఓ ఇంటిపైనే

అకస్మాత్తుగా పిడుగుపడి

ఆ ఇంటిపెద్దే కంటికి దూరమైతే

తిరిగిరాని లోకాలకు తరలిపోతే

ఆ లోటు పూడ్చలేనిది

ఆ క్షోభ తట్టుకోలేనిది

ఆ బాధ భరించలేనిది

ఆ రోదన చెప్పుకోలేనిది

ఆ వేదన అర్థం కానిది

ఆ గాయం మాన్పలేనిది

ఆ కన్నీధార ఆపుకోలేనిది

ఆ విషాద గాథ వర్ణించలేనిది

ఆ ఆర్థిక అల్లకల్లోలం అంతుచిక్కనిది

 

అలా అకస్మాత్తుగా ఖర్మకాలి  

కరోనా పిడుగు నెత్తినపడితే

అప్పుడంతా అయోమయమే

అంధకారమే, గాఢాంధకారమే

బంధువులందరు బహుదూరమే

ఆ సమయాన ఆదుకునే దిక్కెవరని?

భయబ్రాంతులకు గురికావద్దు

అనవసరంగా ఆందోళన చెందవద్దు

అనుమానపడవద్దు అధైర్యపడవద్దు

 

కనిపించని ఈ కరోనా మహమ్మారి 

విషపు కోరలనుండి తప్పించుకోవాలంటే

వ్యక్తిగత శుభ్రతను పాటించాలి

సెల్ఫ్ క్వారెంటైన్ లో వుండాలి

ముఖానికి మాస్కులు ధరించాలి

ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి

వాడిన వస్తువుల్ని శానిటైజేషన్ చెయ్యాలి

 

ఇవే మనకు రక్షణ కవచాలు ప్రతి ఒక్కరు  ధరించాలి

యుద్ధవీరులై కదలాలి కరోనారక్కసిని ఖతంచెయ్యాలి