కరోనా అంటే...ఒక కరెంటు తీగ...
కరోనా అంటే...
కారుచీకటిలో వ్రేలాడుతున్న
హైఓల్టేజ్ కరెంటు తీగ
ఖర్మకాలి కాలికి తగిలితే
కాలి, మసైపోవడం ఖాయం
కరోనా అంటే...
అకస్మాత్తుగా
నెత్తినపడే ఒక భయంకరమైన పిడుగు
ఖర్మకాలి పడితే, కాటికి పోవడం ఖాయం
కరోనా అంటే...
కాలికి గుచ్చుకునే ముళ్ళుకాదు
చైనావాడు మన గుండెల్లో దింపుతున్న గునపం
కరోనా అంటే...
పిల్లలు దీపావళికి పేల్చే లక్ష్మీ బాంబు కాదు
చైనావాడు అందరి ఊపిరి తిత్తుల్లో పెట్టినమందుపాత్ర
అందుకే, ప్రతి ఒక్కరు నిరంతరం నిఘా పెట్టివుండాలి
ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
దయచేసి ఎవరూ కరోనాను లైట్ గా తీసుకోనే వద్దు
అది నిప్పుతో చెలగాటమే, మృత్యువుతో చెస్ ఆడడమే.



