Facebook Twitter
వీరే విజేతలు, ఎవరు?

అలుపెరుగని 

కరోనా పోరులో 

వీరే విజేతలు ఎవరు?

 

ఆందోళన చెందనివారు

అజాగ్రత్తగా వండనివారు

అప్రమత్తంగా వున్నవారు

అవగాహన పెంచుకున్నవారు

నిత్యం నిఘా పెట్టి వున్నవారు

 

అత్యవసరమైతే తప్ప

మందిలోకి వెళ్ళనివారు

విసుగులేక మూఖానికి

మాస్కులు ధరించేవారు

శానిటైజర్ ను వాడేవారు

చేతులు శుభ్రం చేసుకునేవారు

 

నిర్లక్ష్యము వహించనివారు

నియంత్రణ పాటించినవారు

ఫేక్ సందేశాలను నమ్మనివారు

భయపడక ధైర్యంగా వుండేవారు

ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేవారు

నిర్లక్ష్యమే శిక్ష ,ధైర్యమే శ్రీరామరక్షనేవారు