గుంటనక్క కరోనా...
గుంటనక్కలా
నక్కినక్కి తిరిగే
కరోనా పిచ్చి కుక్క
వచ్చి కరవక ముందే
కష్టాల కారుచీకట్లు ఇంటి
చుట్టూ కమ్ముకోక ముందే
కాలసర్పమై చాటుమాటుగా
కరోనా కాటు వేయక ముందే
కరోనారాక్షసి విషపు కోరలకు
చిక్కి విలవిలలాడక ముందే
ముందు జాగ్రత్తలు
కొన్ని తీసుకుంటే మేలు
ప్రతి ఒక్కరు ప్రభుత్వ
నిబంధనలు పాటిస్తే చాలు
అవే మనందరికి శ్రీ రామరక్ష
ఔను మందిలో తిరుగుడు
విందు వినోదాలు ఇకబందు
మాస్కులు, వ్యక్తిగత శుభ్రత
స్వీయ నియంత్రణే,ఈ కరోనా
మహమ్మారికి మత్తు మందు



