Facebook Twitter
వద్దు వద్దు యుద్ధం వద్దు

యుద్ధమంటే...
ప్రవహించేదీ రక్తపుటేరులే
అమాయకపు ప్రజల ఆర్తనాదాలే

యుద్ధమంటే...
విధ్వంసమే వినాశనమే

యుద్ధమంటే...
అర్థంలేని పగలు ప్రతీకారాలే

యుద్ధమంటే...
తిరుగుబాటుదారుల రూపంలో తిరిగే
ఉన్మాదులే ఉగ్రవాదులే మానవమృగాలే

యుద్ధమంటే...
శత్రుమూకల్ని మట్టుపెట్టే
రాకెట్లే యుద్ధవిమానాలే
అణుబాంబులే మరఫిరంగులే
మారణాయుధాలే మారణహోమాలే

యుద్ధమంటే...
హాహాకారాలే విరిగిన కాళ్ళు చేతులే 
తెగి పగిలిన తలలే రక్తపుమడుగులో 
గిలగలకొట్టుకుంటూ విలవిలలాడిపోతూ
కళ్లముందే అయినవారు కన్నుమూస్తుంటే
రక్తం సలసల కాగుతున్నా పిడికిళ్లు బిగించి
చేసినదంతా అరణ్య రోదనై
ఆ నిస్సహాయస్థితిలో శతృవులను
ఎదిరించలేక ఏమీ చేయాలో దిక్కుతోచక
ఎవరిని నిందించాలో అర్థంకాక గుండెలు
బాదుకుని ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పోవడమే

యుద్ధమంటే...
ఆశతో శత్రురాజ్యాలను ఆక్రమించుకోవడమే
వారి సంపదను కొల్లగొట్టడమే దోచుకోవడమే 

కానీ ఈ మనిషి జీవితమేంతో చిన్నదని
ఈ సామ్రాజ్యాలు....ఈ రాజమందిరాలు
ఈ బంగారుసింహాసనాలు అశాశ్వితమని
రెప్పపాటునే...అవి కుప్పకూలిపోతాయని
కళ్ళముందరే... మహా మహా రాజులెందరో
కాలగర్భంలో కలిసిపోయారని...ఆచరిత్ర చేప్పే
ఈ చేదునిజం...ఎవరూ కాదనలేని ఒక నగ్నసత్యం