Facebook Twitter
దొంగ కాపురమొద్దు ప్లీజ్...

ఎందుకో తెలియదు గాని

ముందుగా ముఖపరిచయం 

               - పెట్టేసుకుంటారు 

కాస్త చనువు దొరికితే 

చాలు చిలిపిగా కన్ను

               - కొట్టేసుకుంటారు

చేయి చేయి 

               - పట్టేసుకుంటారు

చాటుమాటుగా 

వేడివేడిగా ముద్దులు

                - పెట్టేసుకుంటారు

కామం నిండిన కళ్ళల్లో

ఎన్నో తీరని కోరికల్ని

ఎన్నో ఆరని ఆశల్ని, దాచి

                - పెట్టేసుకుంటారు

పొదలమాటున కాదు

పట్టపగలే పార్కుల్లో

పదిమంది సాక్షిగా పబ్లిగ్గా

లతలల్లే తనువులు 

               - చుట్టేసుకుంటారు

గుట్టుగా గుడిలో తాళి

                 - కట్టేసుకుంటారు

ఎక్కడో దొంగకాపురం  

                 - పెట్టేసుకుంటారు 

ప్రేమపిచ్చితో తెలిసీ తెలియక 

తమకళ్ళకు తామే గంతలు

                 - కట్టేసుకుంటారు

తమ పరువుకు తామే

తమ బ్రతుక్కు తామే ఆరనిచిచ్చు

                  - పెట్టేసుకుంటారు