కాలేజీలో కాలు పెట్టగానే, డిగ్రీ పట్టగానే
తాళి కట్టగానే, పిల్లలు పుట్టగానే
కంప్యూటర్ ఉద్యోగంలో చేరగానే
కళ్ళకు లక్షలు కనపడగానే
తలనిండా పొగరుతో, కాదుకాదు
అంతులేని అహంకారంతో
కార్పొరేట్ కల్చర్ కి అలవాటుపడి
పబ్బులంటూ క్లబ్బులంటూ పార్టీలంటూ
ఫంక్షన్లంటూ డబ్బులు తెగ తగలేస్తూ
మద్యానికి, మత్తుపదార్థాలకు బానిసై
రోజూ ఒంటరిగా అర్ధరాత్రిలో ఇంటికి చేరుతూ
ఉద్యోగ గర్వంతో విర్రవీగుతూ
"కామంతో కళ్ళుపొరలు కమ్మిన ఓ కామ పిశాచి"
"మతితప్పి",కాదుకాదు పూర్తిగా "దారితప్పి"పోయింది"
శృతి మించి రాగానపడినట్లు
కన్నవాళ్ళ కళ్ళల్లో కారం చల్లి
కన్నబిడ్డను కాదని కాలితో తన్ని
అమాయకపు మొగున్ని అన్యాయం చేసి
ఉద్యోగ గర్వంతో విర్రవీగుతూ
"కామంతో కళ్ళుపొరలు కమ్మిన ఆ కామ పిశాచి"
నక్కినక్కితిరిగే "నక్కతో", కాదు కాదు
కక్కినదానికి ఆశపడే "కుక్కతో" కులుకుతుంది"
తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు
తెలిసి తెలిసి పులినోట తలదూర్చి
కత్తితో,నవ్వుతూ నరికే కసాయివాన్ని నమ్మి
వేటగాని వెంట వెర్రిదానిలా వెళ్లిపోయి
పాము పడగనీడలో ఆదమరచి నిద్రిస్తూ
ఉద్యోగ గర్వంతో విర్రవీగుతూ
"కామంతో కళ్ళుపొరలు కమ్మిన ఆ కామ పిశాచి"
పిచ్చిముదిరి "ప్రియురాలిగా జన్మించింది"
కాదు కాదు "మంచిభార్యగా మరణించింది"
ఆ టక్కరినక్క ఏం మాయ చేశాడో
ఏ మత్తు మందు చల్లాడోగాని
మొన్న వొంటిమీది నగలన్నితాకట్టు పెట్టి
నిన్న బ్యాంకులోన్ పెట్టిబ్యాంకు బ్యాలెన్స్ పెంచి
ఎటిఎం కార్డు ఇచ్చి ఎంజాయ్ చెయ్యమని
ఉద్యోగ గర్వంతో విర్రవీగుతూ
"కామంతో కళ్ళుపొరలు కమ్మిన ఆ కామ పిశాచి"
ఆటోఖర్చులకు సైతం అడుక్కుంటూ
నేడు లక్షలరూపాయల జీతాన్ని "ప్రియుడి చేతుల్లో"
కాదు కాదు వాడి "పాదాలముందు పెట్టింది"
నిన్న కట్టుకున్నవాడి శిరస్సున శివతాండవం చేసి
నేడు మాత్రం ప్రియుడి "పాదాలక్రింద చెప్పులా"
కాదుకాదు ఆ "చెప్పుక్రింది తేలులా" అణిగి మణిగి
ఊర కుక్కకన్న నీచమైన బ్రతుకు బ్రతుకుతూ
ఉద్యోగ గర్వంతో విర్రవీగుతూ
"కామంతో కళ్ళుపొరలు కమ్మిన ఆ కామ పిశాచి"
మళ్ళీ "కాపురాని కెళ్లింది" కాదు కాదు "కాటికెళ్లింది" .



