Facebook Twitter
నీ రాజ్యాన్ని నీవే...పరిపాలించు

ఓ బహుజనుడా !

కన్నతండ్రిలా...ప్రేమించు ! 

ఉపాధ్యాయుడిలా...బోధించు ! 

సంఘ పెద్దలా...సమీకరించు! 

సైన్యాధ్యక్షుడిలా...

యుద్ధభేరి...మ్రోగించు !

విప్లవవీరుడివై...పోరాడు ! 

విజయాన్ని...సాధించు ! 

రాజువై మహారాజువై స్వేచ్ఛా 

స్వాతంత్ర్యం సమానత్వం 

సౌభ్రాతృత్వం పునాదులుగా 

నీ రాజ్యాన్ని నీవే...పరిపాలించు ! 

 

ఆసుపరిపాలనా అమృతఫలాలను 

అందరికీ సమంగా...అందించు ! 

శతాబ్దాలుగా కమ్ముకున్న 

బహుజనుల బానిసత్వపు 

చీకటి తెరలను...తొలిగించు ! 

అస్పృశ్యతా సుడిగాలికి 

ఆరిపోయిన దళితజాతి 

జీవితాలను తిరిగి...వెలిగించు ! 

ఆశయాల సాధనకై...తపించు ! ఆదర్శప్రాయుడివై...అస్తమించు !

 

ప్రపంచం నిన్ను...ప్రశంసించు ! 

ప్రజలంతా నిన్ను...కీర్తించు ! 

దళితజాతి మొత్తం 

గుండెను గుడిగా చేసుకుని 

నిన్నే కులదైవంగా...పూజించు ! 

ముందు వేయితరాలు సైతం 

ఆరనిజ్యోతిగా నిన్నే...ఆరాధించు ! 

నీ నామమే నిత్యం... జపించు !  

అంబేద్కర్ కు ప్రతిరూపంగా

అభినవ అంబేద్కర్ గా 

జై భీమ్ జై భీమ్ అంటూ నిత్యం 

నినదిస్తూ సదా నిన్నే ...స్మరించు !