Facebook Twitter
అంబేద్కర్ అంటే ఒక సైన్యం   

మహర్ కులంలో వెలసిన

"వేగుచుక్క" మన అంబేద్కర్

గంజాయి వనంలో మొలచిన 

"తులసిమొక్క" మన అంబేద్కర్         

 

కోట్లాది గుడిసెల మధ్య 

వెలిసిన వెయ్యంతస్తుల 

"పాలరాతి భవనం" మన అంబేద్కర్

 

వేలాది మంచుకొండలమధ్య 

గుట్టలమధ్య వెలిసిన ఎత్తైన

"ఎవరెస్టు శిఖరం" మన అంబేద్కర్

 

ఎండిన లక్షలాదివృక్షాలమధ్య 

వేలఎకరాలలో విస్తరించిన 

"మహామర్రివృక్షం" మన అంబేద్కర్

 

కావుకావుమని ఆకాశాన అరిచే 

నల్లని కాకులమధ్య హాయిగా ఎగిరే 

"తెల్లని కొంగ" మన అంబేద్కర్

 

విశ్వమంతా వినిపించేలా

విజ్ఞాన గానం చేసి విస్తుపరచిన

"మహర్ కోయిల" మన అంబేద్కర్

 

విరబూసిన విరితోటలో విరిసిన 

అందమైన పూలమధ్య గుప్పుమని 

గుబాళించే "గులాబీపువ్వు" మన అంబేద్కర్

 

అమాయకపు గొర్రెలమందలో దూరిన తోడేళ్ళతో 

"పోరాడి గెలిచిన పొట్టేలు" మన అంబేద్కర్

 

ఏ పులివచ్చి తమను తింటుందోనన్న భయంతో 

గజగజ వణికిపోయే బెదురుచూపుల జింకలమధ్య 

గంభీరంగా నిలుచున్న "గజరాజు" మన అంబేద్కర్

 

అంబేద్కరంటే ఒక సైన్యం...అంబేద్కరంటే ఒక యుద్ధనౌక