Facebook Twitter
విషపునాగులతో వివాదమేల?

దుర్మార్గులకు దూరంగా 

ఉండడం మంచిదేగా...

 

మనధనం వాళ్ళచేతిలో  

ఉన్నంత కాలం మన జుట్టు 

వాళ్ళచేతిలో వున్నట్లేగా 

అద్దాలగదిలో ఉన్నమనము

ఎవరిమీద రాళ్ళు విసరలేముగా

 

రాయి అద్దం మీద పడినా

అద్దం మీద రాయి పడినా

పగిలి ముక్కలయ్యేది అద్దమేగా

 

అరిటాకు మీద ముల్లు పడినా

ముల్లు మీద అరిటాకు పడినా

అడ్డంగా చిరిగేది అరిటాకేగా

 

కల్తీ కంపెనీలతో ఢీ కొనడమంటే 

కొండలతో ఢీ కొట్టడమేగా

 

విషపు నాగులతో వివాదమేల?

మన వివాదం మన శతృవులకు

మహా వినోదం కావచ్చునేమో 

ఔను ప్రతివివాదం ఒక విషాదమే

 

అందుకే ఆలోచించండి

కాని,ఆలస్యం చేయకండి

అస్సలు ఆవేశపడకండి

మనకిప్పుడు పనికావాలి 

అందుకు పక్కా ప్రణాళిక కావాలి

మనశ్శాంతిచిక్కాలి ఫలితం దక్కాలి

గట్టినమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు

సాగిపోవాలి రామబాణంలా దూసుకుపోవాలి