ఓ తాడిత పీడిత ప్రజల్లారా !
ఇతరులపై ఆధారపడినంత కాలం మీరు అనాధలే,
అధికారంతో అహంకారంతో అణచివేతలకు
అవమానాలకు అసమానతలకు గురిచేసి,
మీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు,సంఘంలో
మీ సమానత్వానికి మీ సౌభ్రాతృత్వానికి సంకెళ్లు వేస్తే ...
ధిక్కారస్వరాలతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి...
ప్రశ్నించండి ప్రతిఘటించండి ప్రాణార్పణకైనా సిద్దంకండి...
గర్జించే సింహాల్లా గాండ్రించే పులుల్లా బుసలుకొట్టేనాగుల్లా
ఎగిరే తారాజువ్వల్లా రగిలే నిప్పురవ్వల్లా బ్రతకండి...
అంతే కాని ఆకులుమేసే మేకల్లా బెదురుచూపుల జింకల్లా
బావిలోని కప్పల్లా పంజరాల్లోని పక్షుల్లా బ్రతక్కండి...
మరవకండి ఆకులు మేసే అమాయకపు మేకల్నితప్ప...
పులుల్ని సింహాల నెవరూ పూజకు బలివ్వరన్న...నాటి
అమరజీవి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అమృతవాక్కుల్ని...
ఐక్యతతో సఖ్యతతో ప్రతిఘటించండి పులుల్లా పోరాడండి
పోరాడితే పోయేదేముంది? వెయ్యేళ్ళ మీ బానిసత్వం తప్ప
ఈ పోరాటాల ప్రతిఫలమే మీకు "సంఘంలో సమానత్వం"



