ఓ భారతజాతి
మేలిమి ముత్యమా..!
మీకు కంటిచూపు కరువైతేనేమి?
ఆ సీతారాములపై భక్తితో...
అఖండమైన దైవిక శక్తితో ...
22 భాషలు నేర్చారట...
14 భాషల్లో మీరు పండితులట...
80 బృహత్ గ్రంథాలు లిఖించారట...
అటల్ బిహారీ వాజపేయిచే
ఆవిష్కరింపబడిన మీ సంస్కృత
గ్రంధం "శ్రీ భార్గవరాఘవీయానికి"
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
భారత ప్రభుత్వం చే
పద్మ విభూషణ్ పురస్కారం...
ధర్మ చక్రవర్తి...మహాకవి...సంస్కృత
మహా మహోపాధ్యాయ...కవికుల రత్న... అవాద్ రత్న...పూర్వాంచల్ రత్న...
విశ్వభారతి వంటి బిరుదులు...
విశిష్టమైన సాహితీ పురస్కారాలెన్నో
మిమ్మల్ని వరించాయట...తరించాయట...
ఈ జగతికి మీరే "జగద్గురులట..!
తల్లి భరతమాత నుదుటి తిలకమట..!
ఈ భరతజాతికి మీరే జ్ఞానజ్యోతులట..!
ధరణిలో ఏ నరునికి సాధ్యం కానిదట..!
సాటిలేరు మీకెవ్వరు మీరే ఘనపాటియట!
జయహో ! జయహో !
ఓ జగద్గురు రాంభద్రాచార్యా జయహో !
అబ్దుల్ కలాం రామ్ నాద్ కోవింద్
యుపి ముఖ్యమంత్రుల వంటి మహానుభావులు మహనీయులు మహానేతలెందరో మిమ్మల్ని దర్శించారట...
దివ్యమైన మీ దీవెనలు పొందారట...
ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి
ఆత్మీయఅతిథిగా వచ్చి ఆశీర్వదించారట...
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రాంభద్రాచార్యా జయహో !



