అరచేతిలో స్వర్గం...
ఎవడు కోపిష్టివాడో
పాపిష్టివాడో
అబద్దాలకోరో,ఆశబోతో
నమ్మిన వారిని
నట్టేటముంచే నయవంచకుడో
పచ్చిమోసగాడో
అరచేతిలో స్వర్గం చూపించే
మాయమాటల
మాంత్రికుడో, మందినోట్లో
మట్టికొట్టి అన్యాయంగా
డబ్బును దోచుకొని
బ్యాంకులో దాచుకుంటాడో
అట్టివాడి దుష్టక్రియలన్నీ
ఒకరోజు బట్టబయలు కాక తప్పవు
అట్టివాడికి వీధిలో తిరిగే
గజ్జికుక్క కూడ గౌరవమివ్వదు
అట్టివాడికి ఆ దైవం కూడా
ఏదో ఓరోజు కళ్ళు బైర్లుకమ్మేలా
ఖఠినమైన శిక్షలు విధిస్తాడు
దిమ్మతిరిగి పోయేలా వేటు వేస్తాడు
వాడు దిక్కులేని చావు ఛస్తాడు
వాడు ఛస్తే ఇంటివారు కూడా కంటనీరు పెట్టరు
శ్రేయోభిలాషులలెవ్వరూ సంతాపం ప్రకటించరు
వాడని కిటికీ పెట్టీ ప్రయోజనం లేదు
అట్టివాడు ఈ భూమిపై పుట్టీ ప్రయోజనం లేదు



