Facebook Twitter
జయహో ! జయహో ! ఓ జగద్గురు రామభద్రాచార్యా జయహో ! పార్టు....2

మీరు కలం పట్టి వ్రాయకపోతేనేమి..!
పుస్తకం పట్టి చదవకపోతేనేమి..!
అంధుల బ్రైలీ లిపిని వాడకున్ననేమి..!
సకలశాస్త్రాలను సంస్కృత వ్యాకరణాన్ని...
నాలుగు వేదాలను...18 పురాణాలను...
భారత...భాగవత...రామాయణాది...
సమస్త సనాతన హిందూమత గ్రంథాలను...

ఐదోఏటనే 700 భగవద్గీతశ్లోకాలను...
ఏడోఏట తులసీదాస్ రామచరితమానస్
10900 శ్లోకాలను వింటూ వింటూనే

కంఠస్థంచేసి అందరినీ అబ్బురపరిచారట!
కంప్యూటర్ లకే కళ్ళు బైర్లు కమ్మెనట..!

ఔరా ! వెయ్యి కాగడాలు పట్టి వెతికినా
ఈ భువిలో మీవంటి "ఏకసంధాగ్రాహి"...
మీకంటే "ప్రపంచమేధావి" కానరాడట...
అఖండమైన "జ్ఞాననేత్రం" కలిగినారట...
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !

ఓ భారతమాత పుత్రరత్నమా..!
మీరు అంధులైతేనేమి..!
అంధకారం మీ బంధువైతేనేమి‌..!
చిత్రకూటలోని "తులసీపీఠం" అధిపతిగా
"తులసీ అంధుల పాఠశాలను" ప్రారంభించి
"100 పడకల ఆసుపత్రిని" నిర్మించారట...
అందరికి ఆత్మబంధువులయ్యారట..!

ఓ సానబట్టిన కోహినూరు వజ్రమా !
మీరు కళ్ళులేని కబోధులైతేనేమి...!
కారుచీకటి మీ కన్నతల్లి ఐతేనేమి..!
ప్రపంచంలోనే మొట్టమొదటి
"వికలాంగులవిశ్వవిద్యాలయం" స్థాపించి
కోట్లమంది అంధవిధ్యార్ధుల జీవితాల్లో
వెన్నెల వెలుగులు నింపారట...
అంధులకు ఆరాధ్యదైవమయ్యారట..!
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !