ఓ జ్ఞాననేత్రుడా !
ఓ సరస్వతీ పుత్రుడా !
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో...
జౌనాపూర్ జిల్లాలో...
షాండిఖుర్డ్ గ్రామంలో...
పండిట్ రాజ్ దేవ్ మిశ్రా
శచీదేవి మిశ్రాల గర్భఫలంగా...
గిరిధర్ మిశ్రాగా 1950 జనవరి 14 న
మకర సంక్రాంతినాడు జన్మించారట...
మీ అపారమైన జ్ఞానం...
మీ అమోఘమైన మేధస్సు...
ఊహలకందకున్నదే...
నమ్మశక్యం కాకున్నదే...
మీరు అంధులైతేనేమి?
అనంతమైన ఆకాశంకన్న...
సప్తసముద్రాల లోతుకన్న...
ఎత్తైన ఆ ఎవరెస్ట్ శిఖరం కన్న...
మీ"జ్ఞానసంపదే"మిన్నగా ఉన్నదే...అది
తరతరాలకు"తరగని గని"లాగున్నదే...
ఇది ఏదో "దైవికశక్తి మహిమ"
ఆ "సరస్వతీదేవి కృప" కాక మరేమిటి?
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !
రెండు నెలల వయసులోనే
మీరు కంటిచూపును కోల్పోతేనేమి..!
నిరాశా చెందక నిప్పుకణికలా మారి
యుక్తవయసులో జౌనాపూర్ లోని
ఆదర్శ సంస్కృత మహావిద్యాలయంలో
వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరి కసితో కృషితో గట్టి పట్టుదలతో అన్ని సంవత్సరాలు
అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రథమశ్రేణి విద్యార్థిగా గురువులచే ప్రశంసలందుకున్నారట...
ఢిల్లీలో జరిగిన అఖిల భారత సంస్కృత పోటీలలో పాల్గొని ప్రధాని ఇందిరాగాంధీ చేతులమీదుగా ఐదు బంగారుపతకాలను అందుకున్నారట...అమెరికాలో "కంటి ఆపరేషన్ అవకాశాన్ని" తిరస్కరించారట...
సంపూర్ణానంద సంస్కృత
విశ్వవిద్యాలయంలో బాచిలర్స్...మాష్టార్స్ పి.హెచ్.డి..డి.లిట్ డిగ్రీలను కొల్లగొట్టారట
సంస్కృతభాషలో పట్టుసాధించిన దిట్టలట
సంస్కృతంలోని బృహత్ గ్రంథాలను
పిండి చేసిన పండితోత్తములట...
జయహో ! జయహో ! ఓ
జగద్గురు రామభద్రాచార్యా జయహో !



