మొన్న సోమవారం ( 28 .11. 2022 )
అహ్మదాబాద్ నరేంద్రమోడీ క్రికెట్ గ్రౌండ్లో
మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ జట్లమధ్య
విజయ్ హజారే ట్రోఫీకై...
కనువిందుగా...పసందుగా...
రసవత్తరంగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో...
టి.20 మహారాష్ట్ర జట్టు కెప్టెన్
"బాదుడు కింగ్" రుతురాజ్ గైక్వాడ్
360 డిగ్రీల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్
"బాధిత బౌలర్" శివసింగ్ బౌలింగ్ ను
ఉతికి ఆరేశాడు ఉత్తరప్రదేశ్ జుట్టును
ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు
విధ్వంసకర బ్యాటింగ్ చేసి
ఉత్తరప్రదేశ్ జుట్టుకు
"చుక్కలు" చూపించాడు
"పరుగుల మోత" మ్రోగేవేళ
బ్యాలెన్స్ తప్పి బౌలర్ గీతదాటిన వేళ
అందిన నో బాల్ ఫ్రీ హిట్ తో "బంతులు" "
ఆకాశంలో విహంగాలుగా" ఎగిరి
"సిక్సర్ల వర్షం" కురిసింది
"ఒకే ఓవర్లో ఆరుబంతులకు"
"ఏడు సిక్సర్లతో "43 పరుగులు చేసి
"ప్రపంచరికార్డు" సృష్టించి
మన క్రికెట్ వీరులు
రవిశాస్త్రి యువరాజ్ సింగ్ ల
రికార్డులనే బ్రద్ధలు కొట్టి...
149 బంతుల్లో 16 సిక్సర్లతో 10 ఫోర్లతో
220 పరుగులతో "డబుల్ సెంచరీ"
సాధించి నాటౌట్ గా నిలిచిన ...
మొట్టమొదటి బెస్ట్ బ్యాట్స్మెన్...
"అంతర్జాతీయ" కీర్తికిరీటాన్ని"
ధరించిన "క్రికెట్ కింగ్"..."విశ్వవిజేత"
"ప్రపంచక్రికెట్ చరిత్రలో "సాటిలేని క్రికెటర్"
"అభినవ సచిన్"మన "రుతురాజ్ గైక్వాడ్"
"ఆరు బంతుల్లో ఏడు సిక్సర్లు" కొట్టి
"ఎవరెస్ట్ శిఖరమంత" ఎత్తుకు ఎదిగాడు
మన "త్రివర్ణపతాకం" రెపరెపలాడింది
"క్రికెట్ స్టేడియమంతా" కిలకిలా నవ్వింది
జయహో ! జయహో !
"ఓ యువ క్రికెట్ కిశోరమా" !
జయహో ! జయహో !
"ఓ రుతురాజ్ గైక్వాడ్" !
జయహో ! జయహో !
ఖండాంతర కీర్తినార్జించిన
"ఓ భారతరత్నమా"..!
మీకిదే మా అక్షర కుసుమాంజలి...!



