Facebook Twitter
అస్తమించిన"అభినవ అల్లూరి"…

శ్రీ ఘట్టమనేని
వీరరాఘవయ్యచౌదరి
శ్రీమతి నాగరత్నమ్మల
ఎన్నోజన్మల పుణ్యఫలంగా...
31 మే 1943 న జన్మించిన
"బుర్రిపాలెం బుల్లోడు"
శ్రీ ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
ఇందిర విజయనిర్మలలను
ఇద్దరు భార్యల "ముద్దులమొగుడు"
హీరో రమేష్ బాబు మహేష్ బాబు...
పద్మజ మంజుల ప్రియదర్శినిలను
కంటికి రెప్పలా "కాపాడిన కన్నతండ్రి"

ఏలూరులో అక్కినేనికి జరిగిన
"సన్మానమే" కృష్ణ సినీనటనకు శ్రీకారం
"తేనెమనసులు" చిత్రంతో ప్రారంభమై
"శ్రీశ్రీ చిత్రంతో "ముగిసిన సినీజీవితం

350 చిత్రాలలో
రోజుకు మూడు షిఫ్టుల్లో
రాత్రి పదినుండి తెల్లవారుజాము
రెండుగంటల వరకు
సంవత్సరానికి పది చొప్పున

30 సంవత్సరాలలో 300సినిమాలలో
నటించిన "అగ్రశ్రేణి నటుడు"
"ఆకాశంలో మెరిసే ఒక తార"
చలనచిత్ర జగత్ లో వెలిగే ధృవతార"
"నటశేఖర...సూపర్ స్టార్ కృష్ణ"

సాహసమే ఊపిరిగా
రామబాణంలా దూసుకుపోతూ
ఈడేరింగ్ అండ్ డాషింగ్ హీరో చేసిన
సాహస కృత్యాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు
తెలుగులో తాను నటించి జీవించిన
...తొలి జేమ్స్ బాండ్ చిత్రం
"గూడచారి 116"
...తొలి కౌబాయ్ చిత్రం
"మోసగాళ్లకు మోసగాడు"
...తొలి ఈస్టమన్ కలర్ చిత్రం
"ఈనాడు"
...తొలి సెవెంటీ ఎం.ఎం. చిత్రం
"సింహాసనం"
...తొలి డి.టి.ఎస్ .చిత్రం
"తెలుగు వీర లేవరా"
...తొలి సినిమా స్కోప్ చిత్రం
"అల్లూరి సీతారామరాజు"
ఈ చిత్రమే ధియేటర్లలో
"కలెక్షన్ల కుంభవర్షం" కురిపించింది
ఎన్టీఆర్ కి శ్రీకృష్ణ పాత్రలా
సూపర్ స్టార్ కృష్ణకు అల్లూరి

సీతారామరాజు పాత్ర ప్రేక్షకుల
హృదయాల్లో చెరగని ముద్రవేసింది
ధియేటర్లలో 175 రోజులు 
దిగ్విజయంగా ప్రదర్శింపబడింది
ఇట్టి అనన్య సామాన్యమైన
అద్భుత ప్రయోగాలెన్నో చేసి
తెలుగుతెరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని
అందించిన "సాహసి"సూపర్ స్టార్ కృష్ణ

స్వచ్ఛమైన
అమ్మ పాలలాంటి
మంచిమనసున్న
మచ్చలేని మనిషి...స్నేహశీలి
ఇటు చలనచిత్ర సీమలో
అటు ప్రకృతి వైపరీత్యాల్లో
విరాళాలు సేకరించి ఎందరినో
అదృశ్యంగా ఆదుకున్న
ఆపద్బాంధవుడు అజాతశతృవు
ఎందరికో ఆరాధ్య దైవం ...
సీనియర్ నటుడు...సినీనిర్మాత
పద్మవిభూషణుడు...
పార్లమెంటు సభ్యుడు...
15 చిత్రాల దర్శకుడు...
పద్మాలయా స్టూడియో అధినేత...
సాహసాల పుట్ట ప్రయోగాల దిట్ట...
బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టి
సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి
నటించిన "ఘనత శ్రీ ఘట్టమనేనిదే"

2500 అభిమాన
సంఘాల ఆశిస్సులతో
79 సంవత్సరాలు తెలుగు
చలనచిత్ర సామ్రాజ్యానికి
"మకుటంలేని మహారాజై"
తన నటనకు జేజేలు పలికిన
మొసగాళ్ళకు మోసగాడు చిత్రం
ఆంగ్లంలో "ట్రెజర్ హంట్" పేరుతో
విదేశాలలో విడుదలై
దిగ్విజయంగా ప్రదర్శింపబడి
"ఖండాంతర ఖ్యాతిని" ఆర్జించి
నేడు(15 నవంబర్ 2022 న)
కాంటినెంటల్ హాస్పిటల్లో కన్నుమూసిన
"నటశేఖర...సూపర్ స్టార్ కృష్ణ"
నిత్యం వెండితెరమీద "చిరంజీవియే"...
"మరణం లేని మనసున్న మహారాజే...
వారి పవిత్రఆత్మకు శాంతి కలగాలని
మనసారా కోరుకుంటూ...
అశృనయనాలతో...
శోకతప్త హృదయాలతో...
అందిస్తున్న అక్షర నీరాజనం...