చిన్నపల్లెటూరులో
పేదరైతు కుటుంబంలో జన్మించి
లండన్లో "లా"చదివిన"విద్యావేత్త"
స్వాతంత్ర్య సంగ్రామంలో
అనేక ఉద్యమాల్లో పాల్గొని హక్కులకై
పోరాడిన "ఉక్కు మనిషి" "సర్దార్"
అన్న "ప్రజాబిరుదును" పొందిన
"ఉద్యమకారుడు" జైలే ఇల్లనుకున్న
"స్వాతంత్ర్య సమరయోధుడు"...
దేశవిభజనతో ముక్కలైన భారతావనిని "562 సంస్థానాల"విలీనంతో ఒక్కటిచేసి
సువిశాల...సుందర...సుస్థిర భారతావని సృష్టించిన "సమైక్యతా యోధుడు"...
"ఆపరేషన్ పోలో " పేరుతో సైనిక చర్య చేపట్టి "108 గంటల్లోనే" హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసి
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
రజాకార్ల రాక్షస పాలనను రక్తపాత
రహితంగా అంతం చేసిన"ఉక్కుమనిషి"...
"40 మాసాలే" "తొలి ఉపప్రధాని"గా
"హోం శాఖామంత్రిగా"ఉన్నా విశిష్టమైన సేవలనందించి 1950లో గుండెపోటుతో మరణించిన "ఈ నిస్వార్థ దేశభక్తుడికి"
"41 ఏళ్ల" తర్వాత 1991లో "భారతరత్న" అవార్డును ప్రదానం చేసింది భారత్ సర్కార్
హక్కులకై రక్కసులతో పోరాడి...
ముక్కలైన భారతిని ఒక్కటిచేసిన...
ఈ ఉక్కుమనిషికి...
ఈ సమైక్యతా చక్రవర్తికి...
ఈ నిస్వార్థ దేశభక్తుడికి...
ఈ స్వాతంత్ర్య సమరయోధుడికి...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 597 అడుగుల భారీ"సమైక్యతా విగ్రహాన్ని"
(స్టాచ్యూ ఆప్ యూనిటి) 2018లో గుజరాత్ లో నర్మదానది తీరంలో
నిర్మించి జాతికి అంకితం చేసి...
ఘన నివాళినర్పించింది మోడీ సర్కార్...
జయహో ! జయహో ఓ జాతినేత..!
జయహో ! జయహో ఓ ఉక్కుమనిషీ..!
ఓ సమైక్యతాయోధుడా..!
మీకిదే మా నిత్యనీరాజనం..! జైహింద్..!



