Facebook Twitter
బ్రిటన్ ప్రధాని పీఠంపై...రిషి సునాక్‌..!

బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన
మాజీ ఆర్ధికమంత్రి భారత సంతతికి చెందిన
రిషి సునాక్‌...అంటే "ఒక కోహినూర్ వజ్రం"
ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం
అది భారతజాతి "ప్రతిభకు పట్టాభిషేకం"

తప్పుడు నిర్ణయాలతో కుప్పకూలిన 
బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ధలేక
44 రోజులకే లిస్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా ఇవ్వడం...

ప్రధానమంత్రి అభ్యర్ధి రేసు నుంచి తప్పుకున్నట్టు మాజీ ప్రధానమంత్రి
బోరిస్ జాన్సన్ ప్రకటించడం....

100 మంది సభ్యుల మద్దతైనాలేక
యూకే హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ పోటీ నుండి తప్పుకోవడం
బ్రిటన్ చక్రవర్తి చార్లెస్|||గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం

బ్రిటన్ పార్లమెంట్‌లో 188 మంది
అధికార కన్సర్వేటివ్ సభ్యుల మద్దతుతో...
మాజీప్రధాని బోరిస్ జాన్సన్ కి అత్యంత
సన్నిహితుడు ఆత్మీయుడైన రిషి సునాక్...

గత 100 ఏళ్ళుగా కన్సర్వేటివ్ పార్టీకి కంచుకోటైన రిచ్మండ్ నుండి మూడుసార్లు యంపీగా విజయదుందుభి మ్రోగించిన  "రాజకీయ దురంధరుడు"

నాడు భారత భూభాగంలో చక్రం తిప్పిన
రవి అస్తమించని సామ్రాజ్యమైన బ్రిటన్ అధికారపీఠం దక్కిన "అదృష్టజాతకుడు"

తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చి
ఇంగ్లాండ్ సౌతాంఫ్టన్‌లో కెన్యా తండ్రి "యశ్‌వీర్ కు" పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన టాంజానియా తల్లి "ఉషా సునాక్ కు" జన్మించిన రిషి పూర్వీకులు భారతీయులే

లింకన్ వించెస్టర్ కాలేజీల్లో... స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఫిలాసఫీ ఎకనామిక్స్...పాలిటిక్స్...శాస్త్రాలను
ఔపాసన బట్టిన "ఆర్థిక శాస్త్రవేత్త"...

కంప్యూటర్ దిగ్గజం...
"ఇన్ఫోసిస్ అధినేత" నారాయణమూర్తి కూతురు అక్షితామూర్తిని వివాహమాడి...
కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్ లను ఇద్దరు బిడ్డల్ని కన్న...42 ఏళ్ళ రిషి సునాక్

బ్రిటన్ ధనవంతులలో 222వ
స్థానం సాధించిన "అపరకుభేరుడు"...

బ్రిటన్ ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టాలని
వారిపాలన జనరంజకంగా అప్రతిహతంగా
ప్రజా శ్రేయస్సు...ప్రపంచ శాంతే...లక్ష్యంగా
జరగాలని...ఆకాంక్షిస్తూ...ఆ పరమేశ్వరుని
ప్రార్థిస్తూ అందిస్తున్న "అక్షర కుసుమాంజలి"