అమృతం నిండిన...
మీ గానమాధుర్యంతో...
మీ గంభీరమైన గాత్రంతో...
ఆబాలగోపాలాన్ని అలరించి ఈ
తెలుగుజాతికి"ఖండాంతర ఖ్యాతిని"
ఆర్జించి పెట్టడానికా?
ఎందుకు పుట్టావయ్యా బాలయ్యా ?
ఎందరో ఔత్సాహిక
గాయనీ గాయకులకు...
కొత్త జీవితాలను ప్రసాదించి వారి కుటుంబాలకు "కులదైవమై" నిలిచి పోవడానికి ?... ఔను అసలు
ఎందుకు...
మరణించావయ్యా బాలయ్యా ?
ఆ దుర్వార్త విని
దూరదర్శన్ దుఃఖించింది
తెలుగు చలనచిత్ర సీమ
శోకసముద్రమైంది
మీ మరణం...
మాకొక "పరమసత్యాన్ని" ప్రబోధించింది...
మీరు మాకు భౌతికంగా దూరమైనా...
నిత్యం టీవీఛానెల్లో ప్రత్యక్షమౌతారని...
మీ "సుందరరూపం"
మా కనులకు కనిపిస్తుందని...
మీ "సుమధుర గాత్రం"
మా వీనులకు వినిపిస్తుందని....
మీ మరణం...
మాకొక "ప్రశ్నగా" మిగిలిపోయింది...
ఎన్నో వేల "భక్తిగీతాలను" ఆలపించిన
మీ కంచుకంఠాన్ని కాటువేసే
ఆ కరోనా మహమ్మారిని
ఏ "ఒక్కదైవం" కూడా"శిక్షించలేదు"
ఆ కాలసర్పంనుండి
మిమ్మల్ని"రక్షించలేదు"
ఎందుకో ఏమో...అందుకే
మీ మరణం...
మాకొక "జీవితసత్యాన్ని" ప్రబోధించింది
ఈ జీవితం ఒక జగన్నాటకమని...
అందులో మనమంతా పాత్రధారులమని...
మన తలరాతల్నివ్రాసే బ్రహ్మే సూత్రధారని...
జననమరణాలు ఆపరమాత్మ ఆధీనమని...



