Facebook Twitter
రవి అస్తమించని రాజ్యంలో అస్తమించిన రాణి ఎలిజబెత్ -||

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
ఏడు దశాబ్దాలుగా పరిపాలించి...
స్నేహహస్తం అందించి ప్రపంచ
దేశాధినేతలమనన్నలనందుకుని...
96 ఏళ్ల వయస్సులో"దివికేగిన ధీరవనిత"
మహారాణి ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ‌

బ్రిటన్ రాజు జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్ ల గర్భఫలం 02 ..ఏప్రిల్..1926 లో..జననం
గ్రీస్‌ యువరాజు నేవీ లెఫ్టినెంట్‌ "ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌"తో ప్రేమ పెళ్లి...
20...నవంబర్...1947 లో....

నలుగురు పిల్లల తల్లిగా...
తండ్రి జార్జ్ VI మరణంతో...
గత 900 ఏళ్ళుగా జరిగే పట్టాభిషేక మహోత్సవంలో " బ్రిటిష్ యువరాణిగా"
1661లో తయారైన 2.23 కేజీల బంగారు కిరీటధారణ 02...జూన్......1953 లో...

15 మంది ప్రధానులతో పనిచేసి...
25 దేశాలకు స్వేచ్ఛను ప్రసాదించి...
240 కోట్ల జనాభా ఉన్న 56 స్వతంత్ర దేశాల కామన్వెల్త్ రాజ్యాలకు "అధినేత"....

రాజ కుటుంబాన్ని ఎన్నో
"సమస్యల సునామీలు" ముంచెత్తినా
"రగడలఅగ్ని" రాజుకున్నా చలించక
పట్టుదలతో పరిష్కారించుకుని సమస్యల సుడిగుండాలను దాటిన "ప్రతిభాశాలి"...

సభలలో సమావేశాలలో తన
హాస్యచతురతతో సమయస్ఫూర్తితో 
అందరినీ ఆకర్షిస్తూ...ఆహ్వానిస్తూ...
అలరిస్తూ...ఆత్మీయంగా పలకరిస్తూ...
చిరునవ్వులు చిలకరిస్తూ...స్నేహశీలిగా
"సత్సంబంధాల సారథిగా" విశ్వవారధిగా"
70 ఏళ్ళు బ్రిటన్ మహా పట్టపురాణిగా...
"దివినుండి దిగివచ్చిన ఓ దేవతగా...

96 ఏళ్ళు సంపూర్ణ జీవితాన్ని సంతృప్తిగా అనుభవించింది...అస్తమించింది...
దివికేగింది..."ధృవతారగా"మిగిలిపోయింది
క్వీన్ ఎలిజబెత్...||
వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని...
ఆ దైవాన్ని ప్రార్థిస్తూ....అర్పిస్తున్న.....
అక్షరనీరాజనం...